Budget Phone: ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ.. రూ.15 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్..!
Budget Phone: లావా మొబైల్ ప్రియులకు ఇదిగో శుభవార్త. ఈ స్టైలిష్ 5G ఫోన్ డిస్కౌంట్‌తో కొనడానికి అందుబాటులో ఉంది.
Budget Phone: ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ.. రూ.15 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్..!
Budget Phone: లావా మొబైల్ ప్రియులకు ఇదిగో శుభవార్త. ఈ స్టైలిష్ 5G ఫోన్ డిస్కౌంట్‌తో కొనడానికి అందుబాటులో ఉంది. 'Lava Blaze Curve 5G' స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. లావా కంపెనీ ఈ ఫోన్‌ను మార్చి నెలలో విడుదల చేసింది. ఈ ఫోన్ భారత మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. మొబైల్‌ను అమెజాన్‌లో తక్కువ ధరకు కొనచ్చు. ఈ ఫోన్ బేస్ ధర, ఆఫర్లను తెలుసుకుందాం.
Lava Blaze Curve 5G Offers
లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.17,999, రూ. 18,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 3,000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. తగ్గింపుతో ఈ ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999కి తగ్గింది. అలాగే, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఈ ఫోన్ గ్లాస్ ఐరన్, గ్లాస్ విరిడియన్ రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్‌కు కంపెనీ ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది.
Lava Blaze Curve 5G Features
లావా బ్లేజ్ కర్వ్ 5G ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆమ్లోడ్ 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. రెండు సంవత్సరాల OS, మూడు సంవత్సరాల భద్రతా అప్‌గ్రేడ్లను అందిస్తుంది. 8GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్‌లో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక ప్యానెల్‌లో 20X ఆప్టికల్ జూమ్, 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు. వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.