Samsung Galaxy S23 Ultra 5G: 200 మెగాపిక్సెల్ ఫోన్‌పై భారీ ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకోవచ్చు..!
Samsung Galaxy S23 Ultra 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ ప్రకటించింది.
Samsung Galaxy S23 Ultra 5G: 200 మెగాపిక్సెల్ ఫోన్‌పై భారీ ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకోవచ్చు..!
Samsung Galaxy S23 Ultra 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, క్వాడ్ హై డెఫినిషన్ ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లే ఉంది. ఈ-కామర్స్ సైట్ డిస్కౌంట్స్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy S23 Ultra 5G Specifications
గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5Gలో 6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టాండమ్ షూటర్ ఉంది.
సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇతర ఫీచర్లలో Wi-Fi 6e, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఉన్నాయి.
Samsung Galaxy S23 Ultra 5G Offers
గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు అమెజాన్‌లో రూ.71,899కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మొబైల్‌ని రూ.1,24,999కి లాంచ్ చేసింది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,000 తక్షణ తగ్గింపు ఇస్తుంది.
అంతే కాకుండా ఈ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ మొబైల్‌పై రూ. 27,350 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది.. మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.