iQOO Z9s 5G Discounts: అమెజాన్ బెస్ట్ డీల్.. ఐకూ Z9s 5జీ భారీ ఆఫర్.. ఏకంగా వేలల్లో డిస్కౌంట్లు..!

iQOO Z9s 5G Discounts: దేశీయ టెక్ మార్కెట్ వేగంగా పరుగులు పెడుతుంది. కంపెనీ భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. తాజాగా iQOO Z9s 5G ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించేసింది.

Update: 2025-05-11 13:30 GMT

iQOO Z9s 5G Discounts: అమెజాన్ బెస్ట్ డీల్.. ఐకూ Z9s 5జీ భారీ ఆఫర్.. ఏకంగా వేలల్లో డిస్కౌంట్లు..!

iQOO Z9s 5G Discounts: దేశీయ టెక్ మార్కెట్ వేగంగా పరుగులు పెడుతుంది. కంపెనీ భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. తాజాగా iQOO Z9s 5G ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించేసింది. మీరు రూ.20 వేల బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. ఫోన్‌ను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి ఆర్డర్ చేయచ్చు. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనం కూడా దీనిపై అందిస్తున్నారు. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్‌ప్లే, శక్తివంతమైన కెమెరా సెటప్‌తో వస్తుంది.

ఐకూ Z9s 5జీ ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో పాటు, ఇందులో 5500mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో సోనీ IMX882 కెమెరా సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో అందుబాటులో ఉంది. ఇది IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌తో వస్తుంది.

iQOO Z9s 5G Offers

ఐకూ Z9s 5జీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రూ.18,999 తగ్గింపు ధరకు జాబితా చేశారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, నో-కాస్ట్ ఈఎమ్ఐ, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు కోరుకుంటే తమ పాత ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందచ్చు.

పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా కస్టమర్లు రూ.18,000 వరకు తగ్గింపు పొందచ్చు. ఈ డిస్కౌంట్ పాత ఫోన్ మోడల్, దాని కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లభిస్తుంది. అందులో ఒనిక్స్ గ్రీన్, టైటానియం మాట్టే ఉన్నాయి.

iQOO Z9s 5G Specifcations

ఈ ఫోన్ 6.77-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది, ఇది 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ లేదా 256జీబీ UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది, ఇది మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను సున్నితంగా చేస్తుంది. కెమెరా సెటప్‌లో 50మెగాపిక్సెల్ సోనీ IMX882 మెయిన్ సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి, సెల్ఫీల కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags:    

Similar News