Oppo F27 Pro Plus 5G: అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఒప్పో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
Oppo F27 Pro Plus 5G: ఒప్పో కంపెనీకి చెందిన 'F' సిరీస్ ఫోన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిలో Oppo F27 Pro Plus 5G ఒకటి. ప్రస్తుతం కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.3,950గా నిర్ణయించింది.
Oppo F27 Pro Plus 5G: అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఒప్పో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
Oppo F27 Pro Plus 5G: ఒప్పో కంపెనీకి చెందిన 'F' సిరీస్ ఫోన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిలో Oppo F27 Pro Plus 5G ఒకటి. ప్రస్తుతం కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.3,950గా నిర్ణయించింది. ఈ ఒప్పో మొబైల్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌లో 21శాతం తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఫోన్‌లో 6.7-అంగుళాల 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం.
Oppo F27 Pro Plus 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లే 2412 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. 950 నిట్స్ పీక్ బైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌తో మాత్రమే కాకుండా, స్ప్లాష్ టచ్ కంట్రోల్‌తో కూడా వస్తుంది.
మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఆధారంగా కలర్ ఓఎస్ 14తో పనిచేస్తుంది. ఈ మొబైల్ గ్రాఫిక్స్ కోసం, Mali G68లో GPU కూడా ఉంది. ఈ మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ మెమరీ, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో అమర్చారు. స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, ఈ ఫోన్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇందులో AI ఎరేజర్, AI స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
Oppo F27 Pro Plus Price
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 2,000 ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 1,950 అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మొత్తం రూ.3,950 ఆదా చేయవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ.24,049కి కొనుగోలు చేయచ్చు.