iPhone 16 Plus Discounts: ఆఫర్ అదిరే.. ఐఫోన్ 16 ప్లస్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇప్పుడు ధర ఎంతంటే..?

iPhone 16 Plus Discounts: మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది ఒక గొప్ప అవకాశం కావచ్చు.

Update: 2025-05-23 06:13 GMT

iPhone 16 Plus Discounts: ఆఫర్ అదిరే.. ఐఫోన్ 16 ప్లస్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇప్పుడు ధర ఎంతంటే..?

iPhone 16 Plus Discounts: మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది ఒక గొప్ప అవకాశం కావచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై గొప్ప తగ్గింపు ఉంది, తద్వారా మీరు మంచి పొదుపు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మీరు దీన్ని మీకోసం తీసుకుంటున్నా లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నా, ఈ డీల్‌ని అస్సలు మిస్ చేయకండి.

iPhone 16 Plus Offers

యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 16 ప్లస్‌ను రూ.89,900 ప్రారంభ ధరకు విడుదల చేసింది. ప్రస్తుతం, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో రూ. 81,990 కు జాబితా చేశారు. అంటే దానిపై రూ. 7,910 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అదనంగా, మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగించి ఈఎమ్ఐ లావాదేవీ చేస్తే, మీకు అదనంగా రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ విధంగా, మీరు మొత్తం రూ. 11,910 వరకు ఆదా చేయచ్చు.

iPhone 16 Plus Specifications

ఐఫోన్ 16 ప్లస్‌లో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ యాపిల్ A18 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. అలాగే, ఫోన్ అన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఐఫోన్ 16 ప్లస్ 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 12మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. యాపిల్ ప్రకారం, ఐఫోన్ 16 ప్లస్ మొత్తం 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అదనంగా, హ్యాండ్‌సెట్ IP68-సర్టిఫైడ్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

Tags:    

Similar News