Recharge plan: ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్.. ఎయిర్‌టెల్ నుంచి బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
Recharge plan: టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు కంపెనీలు కొత్త ఆఫర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
Recharge plan: ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్.. ఎయిర్‌టెల్ నుంచి బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
Recharge plan: టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు కంపెనీలు కొత్త ఆఫర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తూ సరికొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తాజాగా ఓటీటీ ప్రియుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రారంభించింది.
‘ఆన్ ఇన్ వన్ ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్’ పేరుతో ఎయిర్‌టెల్ మూడు ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్లను మే 27న విడుదల చేసింది. ఈ ప్లాన్లలో 25కిపైగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ సేవలు, ఉచిత 5జీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
రూ. 279 ప్లాన్
ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జీ5, జియో హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే లాంటి ప్రముఖ ఓటీటీలు లభిస్తాయి. ఇందులో 1 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. వైఫై ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
రూ. 598 ప్లాన్
ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 25కి పైగా ఓటీటీ సేవలు లభిస్తాయి. ఇందులో నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌తో పాటు ఆహా, సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, సన్ నెక్స్ట్, హోయ్ చోయ్, ఈరోస్ నౌ, షెమారూమీ వంటి ఓటీటీలు ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
రూ. 1729 ప్లాన్
ఈ భారీ ప్యాక్ 84 రోజుల వరకూ అందుబాటులో ఉంటుంది. రోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రూ. 598 ప్లాన్‌లో లభించే ఓటీటీలను ఉచితంగా పొందొచ్చు. దీని ద్వారా మూడు నెలల పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిరంతరంగా ఆస్వాదించవచ్చు.