Scientists: ఇక ఏఐతో 100 ఏళ్లు పక్కా.. శాస్త్రవేత్తలు

Scientists: ఇందుగలదందులేదని.. అనే మాట నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కు బాగా సరిపోతుంది.

Update: 2025-07-07 10:48 GMT

Scientists: ఇక ఏఐతో 100 ఏళ్లు పక్కా.. శాస్త్రవేత్తలు

Scientists: ఇందుగలదందులేదని.. అనే మాట నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కు బాగా సరిపోతుంది. ఎందుకంటే తెల్లారి లేచినప్పటినుంచి రాత్రి పడుకునేవరకు అడగడుగునా ఇది వెన్నంటే ఉంటుంది. విద్య నుండి వైద్యం వరకు.. వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు.. అన్నింటిలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఏఐ సాయంతో మనిషిలో జన్యు మార్పిడి చేసి 100 ఏళ్లు పక్కగా బతికేలా చేస్తుందని. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోదనలు చేస్తున్నారు.. వివరాలు చూద్దాం.

మనిషి సగటు జీవితకాలం పురాతన కాలంలో 100ఏళ్లు ఉంటే ఈ మధ్య కాలంలో 70 ఏళ్లకు పడిపోయింది. అదే హాంకాంగ్, దక్షిణ కొరియాలో 85ఏళ్లు జీవితకాలం ఉండి టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అయితే ఇప్పుడు తాజాగా మనిషిలోని జన్యువులను మార్పిడి చేసి.. మనిషి 100 నుంచి 150 ఏళ్లు బతికేలా చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏదో జబ్బు వస్తే డాక్టర్లు దాన్ని నయం చేసిన తర్వాత కొంతకాలం ఆయుష్సు పెరిగిందంటే నమ్మొచ్చు. కానీ ఏఐ ద్వారా ఇలా ఎలా సాధ్యం అనేది అందరికీ అనుమానం రావొచ్చు. అయితే ఎలాంటి దాన్నయినా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే గుణం ఏఐ కి ఉంది. ఈ శక్తిని ఉపయోగించడం వల్ల సరైన చికిత్సలేని జబ్బులను కూడా నయం చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కొన్ని ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చని కూడా అంటున్నారు.

సైంటిస్టులు ఇంకా ఏం చెప్పారంటే.. మన శరీరంలోని క్రోమోజోములు చివర భాగంలో ఉండే టెలోమియర్ల పొడుగు మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ ఎలా చేస్తారంటే టెలోమియర్లు పొడవు తగ్గకుండా కొన్ని ఇంజెక్షన్లు, మందులు వాడొచ్చు.. అప్పుడు టెలోమియర్లు పెరగడం లేదని పరిశోధనల్లో తేలింది. అయితే ఈ పరిశోధనలు చాలా కాలంగా చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ ప్రక్రియలో ఏఐని ఉపయోగించడం వల్ల సరైన ఫలితాలు వస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పుడు లానే ప్రక్రియ కొనసాగితే.. త్వరలో అనుకున్నది సాధించవచ్చని భావిస్తున్నారు.

నిజంగా ఈ పరిశోధనలు సక్సెస్ అయితే మనిషి ఏకంగా 150ఏళ్లు బతకొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మరోవైపు 150 ఏళ్లు ఏమోగానీ 100 ఏళ్లు పక్కాగా బతకొచ్చని మరికొంతమంది సైంటిస్టులు అంటున్నారు.

Tags:    

Similar News