Whatsapp: నిబంధనలను ఓకే చేయకుంటే.. వాట్సప్ ను వాడలేరు: వాట్సాప్

Whatsapp: వాట్సప్ త్వరలో తీసుక రాబోయే ప్రైవసీ పాలసీపై అనేక విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Update: 2021-05-09 11:04 GMT
వాట్సప్ (ఫొటో ట్విట్టర్)

Whatsapp: వాట్సప్ త్వరలో తీసుక రాబోయే ప్రైవసీ పాలసీపై అనేక విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తన ప్రైవసీ పాలసీపై వివరణ ఇచ్చినా కూడా ... ఆ విమర్శలు ఆగలేదు. మే 15న వాట్సప్ తమ వినియోగదారులకు అందించనున్న ప్రైవసీ పాలసీతో ఎలాంటి ఇబ్బంది లేదని, దాని వల్ల వాట్పప్ వినియోగంలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదని వాట్పప్ తెలిపింది. కానీ, త్వరలో వచ్చే పాలసీని ఒప్పుకోకపోతే, వాట్సప్ లో అన్ని ఫీచర్లను వాడుకోలేరనేది నిజం.

ఇండియాలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాం, కొత్త విధానాన్ని అంగీకరించడంలో విఫలమైతే వినియోగదారులకు నిరంతరం కొన్ని రిమైండర్‌లను పంపిస్తుంది. వీటిని ఓకే చెయ్యకపోతే వాట్సప్ లోని అన్ని ఫీచర్లను వాడలేరని వాట్సప్ వెల్లడించింది.

'ప్రతీ ఒక్కరు ప్రైవసీ పాలసీని సమీక్షించుకోవడానికి కొంత సమయం ఇస్తాం. నిబంధనలను పూర్తిగా సమీక్షించుకున్నాక ఓకే చెయ్యకపోతే.. మరలా మరలా రిమైండ్ చేస్తాం. అప్పటికీ నిబంధనలు ఓకే చెయ్యకపోతే వాట్సప్‌లోని అన్ని ఫీచర్లను వాడలేరని' వాట్సప్ తెలిపింది. మే 15న తర్వాత ఏం జరగనుందో చూడాలి మరి.

Tags:    

Similar News