Womens Day: ప్రైవసీ కోసం వాట్సప్‌లో ఈ ఫీచర్లు ప్రయత్నించారా..?

International Womens Day: వాట్సప్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్.

Update: 2021-03-06 16:00 GMT

వాట్సప్

International Womens Day: వాట్సప్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. ఇది ఎంత పాపులరో అందరికీ తెలిసిందే..అలాగే ప్రైవసీ, ఆన్‌లైన్ లో వేధింపుల విషయంలోనూ అంతే హాని కలిగించేలా తయారైంది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో కొన్నిసార్లు విమర్ళలను కూడా ఎదుర్కొంది వాట్సప్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రైవసీ కోసమే కాక వాట్సప్ యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిన ఆరు సేఫ్టీ ఫీచర్లను ఇప్పడు చూద్దాం...

అభ్యంతరకరమైతే బ్లాక్ చేయండి.. స్పామ్ గా రిపోర్ట్ చేయండి

వాట్పప్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారు ఇబ్బంది కరంగా మెసేజ్ లు చేస్తే..వారిని బ్లాక్ లిస్టులో పెట్టేయోచ్చు. అలానే ఇతరులు మన అప్ డేట్స్ ను చూడకుండా చేయగలిగే ఆఫ్షన్ ఉంది. ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్ ఆన్‌లైన్ ఆఫ్షన్స్ ఇదే కోవలోకి వస్తాయి. బ్లాక్ చేసిన కాంటాక్ట్ ల నుంచి వచ్చిన మెసేజ్ లు మనకు చెక్ మార్క్‌తో చూపిస్తుంది.

మెసేజ్ లను మాయం చేసేయోచ్చు..

ఈ ఆఫ్షన్ ను ఉపయోగించి మెసేజ్‌లను ఒక వారం తరువాత కనిపించకుండా చేయవచ్చు. పర్సనల్ లేదా గ్రూప్ చాటింగ్స్ లో కూడా ఈ ఆఫ్షన్ ను వాడొచ్చు. కానీ, గ్రూప్ చాట్ లో మాత్రం అడ్మిన్ లకు మాత్రమే ఈ ఫీచర్ ను ఆన్ లేదా ఆప్ చేసే వీలుంది.

ఫింగర్ ప్రింట్, పేస్ అన్‌లాక్

ఐఓస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్, పేస్ ఐడీల ను ఉపయోగించి మీ వాట్సప్ ఖాతాను లాక్ చేసి ఇతరులు ఓపెన్ చేయకుండా రక్షణ పొందవచ్చు.

గ్రూప్ చాట్స్

వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లో ఎవరినైనా చేర్చవచ్చు. ఇలాంటి గ్రూపుల్లో మీరు జాయిన్ కాకుండా ఉండాలనుకుంటే ..మీ సెట్టింగుల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మీ స్నేహితులు లేదా పరిచయస్తులు మాత్రమే గ్రూపుల్లో చేర్చేలా సెట్టింగ్స్ మార్చుకుని భద్రత గా ఉండోచ్చు.

టూ స్టెప్ వెరిఫికేషన్

మీ వాట్సప్ అకౌంట్‌ను సేప్టీగా ఉంచేందుకు టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆఫ్షన్ చాలా కీలకమైంది. యూజర్లు ఈ ఫీచర్ ను ఆన్ చేసుకుంటే..ఆరు అంకెల పిన్ నంబర్ ను పెట్టుకుని స్టేప్టీ గా ఉండోచ్చు. రీసెట్ చేసేప్పుడు, అలాగే వాట్సప్ అకౌంట్ ను వెరిఫై చేసుకునేప్పుడు ఆ పిన్ ను వాడి అకౌంట్ ను ధృవీకరణ చేసుకోవచ్చు. సెట్టింగ్స్> అకౌంట్> టూ స్టెప్ వెరిఫికేషన్> ఎనబుల్ చేసుకోవాలి.

వాట్సాప్ వెబ్ సెక్యూరిటీ

వాట్సప్ ను క్యూఆర్ కోడ్ తో డెస్కటాప్ లోనూ వాడే సదుపాయం ఉందనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వచ్చిన అప్ డేట్ లో పేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ తో డెస్క్ టాప్ ఆప్ లో వాడుకోవచ్చు.

ఈ ఫిచర్లను వాడి మీ వాట్సప్ అకౌంట్ ను సేఫ్టీ గా ఉంచుకోవచ్చు.

Tags:    

Similar News