AC Electricity Bill: 1.5 టన్ ఏసీని 8 గంటలపాటు ఆన్ చేస్తే కరెంటు బిల్లు ఎంత వస్తుంది? నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
AC Electricity Bill: భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పుడు మండే వేసవి రోజులు వచ్చాయి.
AC Electricity Bill: 1.5 టన్ ఏసీని 8 గంటలపాటు ఆన్ చేస్తే కరెంటు బిల్లు ఎంత వస్తుంది? నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
AC Electricity Bill: భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పుడు మండే వేసవి రోజులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లలోనూ ఏసీలు పనిచేయడం ప్రారంభించాయి. ఏసీ వాడితే కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 8 గంటల పాటు ఏసీ నడిస్తే ఎంత బిల్లు వస్తుందో ఈజీ లెక్కల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు చాలా మంది ఒకటిన్నర టన్ను ఏసీని కొంటున్నారు. ఎందుకంటే ఇది మీడియం సైజు గదికి సరిపోతుంది. అయితే, ఏసీ కొనే సమయంలో విద్యుత్తు బిల్లు పెద్దగా ఆందోళన కలిగిస్తుంది. చాలా ఇళ్లలో ఏసీ ఉంటుంది. కానీ, ఈ వేడిలో రాత్రంతా నడపరు. తద్వారా కరెంటు బిల్లు పెరగకుండా ఉంటుందని ఆలోచిస్తుంటారు. అసలు రోజుకు ఒకటిన్నర టన్ను ఏసీ 8 గంటల పాటు నడిస్తే నెలాఖరుకు ఎంత బిల్లు వస్తుందో అర్థం చేసుకుందాం.
మీరు రోజూ 8 గంటల పాటు నిరంతరంగా ఇన్వర్టర్ టెక్నాలజీతో కూడిన 1.5 టన్నుల ఎల్‌జీ ఏసీని ఉపయోగిస్తున్నారు అనుకుందాం. 80% విద్యుత్ వినియోగంతో ఇన్వర్టర్ 1.5 టన్ను LG AC మొదటి గంటలో సుమారు 700 వాట్ల శక్తిని వినియోగిస్తుంది. ఆ తర్వాత 4 గంటలపాటు 500 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఆ తర్వాత 3 గంటల్లో దాదాపు 200 వాట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అయితే, ఇది బయటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సగటు ఉష్ణోగ్రతపై లెక్కించాం.
అంటే, 8 గంటల పాటు ఏసీ ఆన్ చేసిన తర్వాత, 1.5 టన్ను LG ఇన్వర్టర్ AC వినియోగం 3.3-4 యూనిట్ల వరకు ఉంటుంది. అంటే 8 గంటల పాటు ఏసీని రన్ చేయడం ద్వారా రోజూ 4-5 యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయవచ్చు. అందుకే ఇక్కడ 8 గంటల లెక్క ఉంచారు. ఎందుకంటే, చాలా సాధారణ ఇళ్లలో, రాత్రిపూట మాత్రమే నిద్రపోయేటప్పుడు AC ఉపయోగిస్తుంటారు.
కానీ, పాత ఏసీలు 2000-2500 వాట్ల విద్యుత్తును వినియోగించుకోగలవు. వాటిని కొనుగోలు చేయడం వల్ల అధిక విద్యుత్ బిల్లులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో 8 గంటల పాటు ఏసీని నడపాలంటే రూ.20 యూనిట్ల వరకు ఖర్చవుతుంది.