Yuzvendra Chahal : యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల వెనుక అసలు కారణం తెలిసిందోచ్

Update: 2025-03-26 06:30 GMT

Yuzvendra Chahal, Dhanashree Verma Divorced

Yuzvendra Chahal : క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 20న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే, వీరి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని మాత్రమే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఓ కొత్త రిపోర్టు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ విడిపోవడానికి అసలు కారణం ఏంటనేది ఈ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య నివాస స్థలం విషయంలో విభేదాలు తలెత్తాయని, దీని కారణంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నారని రిపోర్టు పేర్కొంది.

వివరాల్లోకి వెళితే.. ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ కథనం ప్రకారం.. డిసెంబర్ 2020లో పెళ్లి జరిగిన తర్వాత ధనశ్రీ, హర్యానాలోని చాహల్, అతని తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి వెళ్లింది. కానీ కొన్ని రోజుల తర్వాత ధనశ్రీ ముంబైలో ఉండాలని కోరుకుంది. అయితే, చాహల్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కోరుకున్నాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీని కారణంగానే వీరు విడాకులు తీసుకున్నారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

అయితే, ఈ విషయంపై చాహల్, ధనశ్రీ లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని వారిద్దరూ అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఐపీఎల్ 2025 ప్రారంభానికి రెండు రోజుల ముందు, మార్చి 20న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల కింద యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకు 4.75 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అందులో 2.37 కోట్ల రూపాయలు చాహల్ ధనశ్రీకి ఇచ్చాడని, మిగిలిన డబ్బును కూడా త్వరలోనే ఇస్తాడని సమాచారం.

Tags:    

Similar News