IPL2023: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు.. బద్దలు కొట్టిన యశస్వి జైశ్వాల్

* ఐపీఎల్ 16లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ అదరగొడుతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన జైశ్వాల్..

Update: 2023-05-20 07:18 GMT

IPL2023: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు.. బద్దలు కొట్టిన యశస్వి జైశ్వాల్

IPL2023: ఐపీఎల్ 16లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ అదరగొడుతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన జైశ్వాల్..ఈ సీజన్ లో 600 మార్కును దాటి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ సీజన్ ను రసవత్తరంగా కొనసాగిస్తోంది. ఐపీఎల్ రాకతో ఎందరో వర్థమాన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, రిటైర్డ్ క్రికెటర్లకు సైతం ఉపాధి చూపిస్తోంది. టీమిండియాలో చోటు సంపాదించుకునేందుకు ఐపీఎల్ ఒక షార్ట్ కట్ గా మన ఆటగాళ్లను ఊరిస్తోంది. ప్రస్తుతం 16వ సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 16 ఏళ్ల చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

యశస్వి జైశ్వాల్ ఈ సీజన్ లో వెలుగులోకి వచ్చిన ఆణిముత్యం. తనదైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్న యశస్వి..ఈ సీజన్ లో 600 పరుగుల మార్క్ ను దాటేశాడు. ఫలితంగా అరుదైన రికార్డ్ అతని వశం అయింది. ఒక సీజన్ లో 600 పరుగులు మార్క్ ను అందుకున్న తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా యశస్వి జైశ్వాల్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు.

ఈ సీజన్ లో 14 మ్యాచులు ఆడిన జైశ్వాల్ 625 పరుగులు చేశాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారులు జాబితాలో జైశ్వాల్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 702 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. 

Tags:    

Similar News