WTC Points Table: ఇంగ్లాండ్ కోటను బద్దలు కొట్టిన భారత్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు!
WTC Points Table: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఎట్టకేలకు తన గెలుపు ఖాతాను తెరిచింది. లీడ్స్ టెస్ట్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేసినప్పటికీ, ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైన టీమిండియా, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌ను 336 పరుగుల భారీ తేడాతో గెలిచి అదరగొట్టింది.
WTC Points Table: ఇంగ్లాండ్ కోటను బద్దలు కొట్టిన భారత్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు!
WTC Points Table: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఎట్టకేలకు తన గెలుపు ఖాతాను తెరిచింది. లీడ్స్ టెస్ట్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేసినప్పటికీ, ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైన టీమిండియా, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌ను 336 పరుగుల భారీ తేడాతో గెలిచి అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన కనబరిచి, ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం తర్వాత, టీమిండియా 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్స్ టేబుల్‌లో పెద్ద ఎత్తున దూసుకెళ్లి నాలుగో స్థానానికి చేరుకోగా, భారీ తేడాతో ఓటమిపాలైన ఆతిథ్య ఇంగ్లాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ గెలిచిన టీమిండియా, నాలుగో ఎడిషన్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో ఓడి, ఒకదానిలో గెలిచింది. దీంతో 50% గెలుపు శాతంతో 12 పాయింట్లను సంపాదించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే, రెండో మ్యాచ్ గెలవడం ద్వారా పాయింట్స్ టేబుల్‌లో తన ఖాతాను తెరిచింది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టు 12 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఓటమి తర్వాత మూడో స్థానానికి పడిపోయింది.
ఈ పట్టికలో ఆస్ట్రేలియా 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, దాని గెలుపు శాతం 100%. శ్రీలంక రెండు మ్యాచ్‌లలో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది, దాని గెలుపు శాతం 66.67%. బంగ్లాదేశ్ కూడా ఆడిన 2 మ్యాచ్‌లలో 4 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, కేవలం ఒక మ్యాచ్ ఆడి అందులో ఓటమిని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టు ఆరో స్థానంలో ఉంది.
రెండో టెస్ట్‌లో భారత్‌కు ఘన విజయం
రెండో టెస్ట్ మ్యాచ్ వివరాలలోకి వెళ్తే, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు సాధించింది. దీనికి బదులుగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 427 పరుగులకు డిక్లేర్ చేసింది. చివరగా, భారత్ నిర్దేశించిన 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఇంగ్లాండ్, కేవలం 271 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున ఆకాష్ దీప్ అద్భుతంగా రాణించి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయం ఫలితంగా, టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.