మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ పోరు
Australia vs England: మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ పోరు తలపడుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.
మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ పోరు
Australia vs England: మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఏడోసారి విశ్వవిజేత కావాలని ఆస్ట్రేలియా, టైటిల్ ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ అమీ తుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్ లో గెలిచి హాట్ ఫేవరేట్ గా ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే ఇంగ్లండ్ టీమ్ ఆల్ రౌండ్ ప్రతిభ చాటాల్సిన అవసరం ఉంది. న్యూజీలాండ్ లోని హ్యాగ్లీ ఓవల్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు.. హోరా హోరీగా సాగుతున్న మ్యాచ్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి..