Women's IPL: నేడు మహిళల ఐపీఎల్ వేలం.. వేలంలో 5 ప్రాంఛైజీలు
Women's IPL: వేలంలో 246 మంది స్వదేశీ, 163 మంది విదేశీ క్రికెటర్లు
Women's IPL: నేడు మహిళల ఐపీఎల్ వేలం.. వేలంలో 5 ప్రాంఛైజీలు
Women's IPL Auction: ఉమెన్స్ ప్రిమియర్ లీగ్‌లో మరో కీలక అంకానికి రంగం సిద్ధమైంది. తొలిసారి నిర్వహించనున్న WPL వేలం ఇవాళ ముంబై వేదికగా జరగనుంది. స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, యువ సంచలనం షెఫాలీ వర్మలపై అందరి దృష్టి నెలకొంది. వీళ్లకు కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని భావిస్తున్నారు. అలీసా హేలీ, బేత్ మూనీ, ఎలిస్ పెర్రీలతో పాటు మెగాన్ షట్, నాట్ సీవర్, డాటిన్ వంటి విదేశీ స్టార్లకు కూడా భారీ ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 5 ఫ్రాంఛైజీలు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్ 409 మందితో కూడిన క్రికెటర్ల జాబితాలో 90 మంది కోసం పోటీపడనున్నాయి.
ప్రతి జట్టు గరిష్టంగా 12 కోట్లు ఖర్చు చేయొచ్చు. ఆరుగురు విదేశీ ఆటగాళ్లు సహా 18 మందిని కొనుక్కోవచ్చు. కనీసం 15 మందిని తీసుకోవాలి. క్రికెటర్ల కనీస ధర 10 లక్షలతో మొదలవుతుంది. అత్యధిక కనీస ధర 50 లక్షలు. వీటితో పాటు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల విభాగాలు కూడా ఉన్నాయి. స్మృతి, షెఫాలీ, హర్మన్‌ప్రీత్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు 1.25 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ధర రావొచ్చని భావిస్తున్నారు. 246 మంది భారత క్రికెటర్లు, 163 మంది విదేశీ క్రికెటర్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.