Wiaan Mulder : సౌతాఫ్రికా ప్లేయర్ సంచలనం.. టెస్టుల్లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ
Wiaan Mulder : జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వయాన్ ముల్డర్ కు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా రికార్డును బద్దలు కొట్టే అద్భుత అవకాశం లభించింది.
Wiaan Mulder : సౌతాఫ్రికా ప్లేయర్ సంచలనం.. టెస్టుల్లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ
Wiaan Mulder : జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వయాన్ ముల్డర్ కు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా రికార్డును బద్దలు కొట్టే అద్భుత అవకాశం లభించింది. అయితే, అతను 367 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సౌత్ ఆఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 626 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆట ముగిసిన తర్వాత, ముల్డర్ బ్రియన్ లారా టెస్ట్ క్రికెట్‌లో చేసిన 400 పరుగుల రికార్డును ఎందుకు బద్దలు కొట్టలేదో వెల్లడించాడు.
జింబాబ్వేతో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, బ్రియన్ లారా రికార్డు గురించి ముల్డర్ ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టాడు. "మాకు కావాల్సిన పరుగులు వచ్చాయి. ఇప్పుడు బౌలింగ్ చేయాలని నేను భావించాను. రెండో విషయం ఏంటంటే, బ్రియన్ లారా ఒక గొప్ప ఆటగాడు. అంతటి గొప్ప ఆటగాడి రికార్డును అలాగే ఉంచడం సరైనదని అనుకున్నాను. మళ్ళీ అలాంటి అవకాశం వస్తే నేను కచ్చితంగా అలాగే చేస్తాను. నేను శుక్రి కాన్రాడ్ తో మాట్లాడాను. అతనికి కూడా అదే అనిపించింది. బ్రియన్ లారా ఒక లెజెండ్, ఆ రికార్డును అతనే ఉంచుకోవాలి." అని అన్నాడు.
బ్రియన్ లారా 2004లో ఇంగ్లాండ్‌పై అజేయంగా 400 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడూ ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. బ్రియన్ లారా రికార్డును బద్దలు కొట్టలేకపోయినప్పటికీ ముల్డర్ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా కెప్టెన్ జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండవ అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని సాధించాడు. అతను 334 బంతుల్లో 49 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో అజేయంగా 367 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 626 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 626 పరుగులు చేసిన తర్వాత, జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ కేవలం 170 పరుగులకే ముగిసింది. దీంతో సౌతాఫ్రికాకు 456 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సౌత్ ఆఫ్రికా తరఫున ప్రెనెలాన్ సుబ్రాయన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత, సౌత్ ఆఫ్రికా జట్టు జింబాబ్వేను ఫాలో ఆన్ ఆడమని ఒత్తిడి చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌కు 51 పరుగులు చేసింది. వారు ఇప్పటికీ 405 పరుగులు వెనుకబడి ఉన్నారు.