Neeraj Chopra : నీరజ్ చోప్రా భార్య హిమాని గురించి తెలిసిందోచ్.. ఆమె ఓ సంచలనం
Neeraj Chopra : నీరజ్ చోప్రా భార్య హిమాని గురించి తెలిసిందోచ్.. ఆమె ఓ సంచలనం
Neeraj Chopra : భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆయన అభిమానులు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. నీరజ్ భార్య పేరు హిమాని. ఆమె కూడా నీరజ్ లాగే అథ్లెట్ అని తెలిసింది. కానీ నీరజ్ అనే పేరు ప్రపంచానికి తెలియని సమయంలోనే తన భార్య హిమాని భారతదేశంలో ఒక సంచలనం సృష్టించింది. సానియా మీర్జా జూనియర్ అయిన హిమాని 2012 లోనే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నీరజ్ చోప్రా పేరు 2020లో మార్మోగిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిచిన తర్వాత ఆయన అంటే ఎవరో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు . అథ్లెటిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న తొలి భారతీయుడిగా అతడు నిలిచారు. తన ఈటెతో దేశ విధిని మార్చిన తొలి భారతీయుడు నీరజ్ చోప్రా. అతన్ని భారత క్రీడల గోల్డెన్ బాయ్ అని పిలుస్తారు. దీని తర్వాత నీరజ్ 2023లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. అయితే, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అతను తన బంగారు పతకాన్ని కాపాడుకోలేకపోయాడు.
కానీ, అతని భార్య హిమాని 2012లో మలేషియాలో జరిగిన అండర్-14 జూనియర్ ఫెడ్ కప్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆమె దృష్టిని ఆకర్షించింది. అండర్-14 జూనియర్ ఫెడ్ కప్‌ను ఇప్పుడు బిల్లీ జీన్ కింగ్ కప్ అని పిలుస్తారు. ఆ తర్వాత హిమానీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2018లో ఆమె జాతీయ టోర్నమెంట్ అరంగేట్రం చేసిన రెండు నెలల తర్వాత ఆమె AITA ర్యాంకింగ్స్‌లో సింగిల్స్‌లో 42వ ర్యాంక్ క్రీడాకారిణిగా, డబుల్స్‌లో 27వ ర్యాంక్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె వరుసగా 14 వారాల పాటు AITA డబుల్స్ ర్యాంకింగ్‌లో టాప్ 30 క్రీడాకారిణులలో నిలిచింది.