Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌పై కలకలం.. రంగంలోకి దిగిన మాజీ క్రికెటర్!
Virat Kohli: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌పై కలకలం.. రంగంలోకి దిగిన మాజీ క్రికెటర్!
Virat Kohli: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది క్రీడా ప్రపంచంలో పెద్ద కలకలం రేపుతోంది. బీసీసీఐ కూడా ఆందోళనలో పడింది. ఒకవేళ విరాట్ కోహ్లీ నిజంగానే ఈ ఆలోచనలో ఉంటే దానిని మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ అతనికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరొక పేరు చేరింది. ఎప్పుడూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించే ఈ భారత మాజీ బ్యాట్స్‌మెన్ ఇప్పుడు విరాట్‌ను రిటైర్మెంట్ తీసుకోవద్దని వేడుకుంటున్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? ఎందుకు అంతలా కోరుకుంటున్నాడు? వివరంగా తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడనే వార్త విని భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. విరాట్ కోహ్లీ ఇంకా చాలా క్రికెట్ ఆడగల సత్తా కలిగి ఉన్నాడని, అలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఇప్పుడు అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. అంబటి రాయుడు సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో, "విరాట్ కోహ్లీ ప్లీజ్ రిటైర్ అవ్వకండి.. భారత జట్టుకు మీ అవసరం మునుపటి కంటే ఎక్కువగా ఉంది. మీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. మీ లేకుండా టెస్ట్ క్రికెట్ మునుపటిలా ఉండదు.. ప్లీజ్ మీ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించండి" అని రాసుకొచ్చాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కామెంట్రీ చేస్తున్న అంబటి రాయుడు, కోహ్లీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో CSKపై RCB విజయం సాధించినప్పుడు.. "RCB టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకుంటున్నారు" అని రాయుడు వ్యాఖ్యానించాడు.
కొద్ది రోజుల క్రితం RCB టైటిల్ గెలుచుకోవడం గురించి మాట్లాడుతూ.. "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ గెలిచే కల త్వరలో నిజం కావచ్చు, కానీ ఈ సీజన్‌లో మాత్రం ఆ కల నెరవేరకూడదని నేను ఆశిస్తున్నాను" అని అన్నాడు. దీని తర్వాత RCB అభిమానులు అతనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ సీజన్‌లో RCB అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. జట్టు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.