Virat Kohli emotional: చివరి వరకు ఆర్‌సీబీకే ఆడతా.. విరాట్ కోహ్లి ఎమోషనల్ స్టేట్ మెంట్..!!
Virat Kohli emotional: చివరి వరకు ఆర్‌సీబీకే ఆడతా.. విరాట్ కోహ్లి ఎమోషనల్ స్టేట్ మెంట్..!!
Virat Kohli emotional: ఐపీఎల్ 2025 టైటిల్ ను గెలిపించుకుంది ఆర్సీబీ. ఈ చారిత్రాత్మక విజయంపై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో కన్నీళ్లు తెచ్చుకున్న కోహ్లీ..నా హృదయం, నా ఆత్మ అన్నీ బెంగళూరుతోనే అనుబంధంగా ఉన్నాయి. నేనెప్పుడు ఐపీఎల్ ఆడుతున్నా..ఆర్సీబీ కోసమే ఆడుతున్నట్లు తెలిపారు.
నా నమ్మకాన్ని ఎప్పుడూ మార్చలేదు..ఇతరులు కొత్త జట్లకు మారినా..నేను మాత్ం ఆర్సీబీకి నా విధేయతగా ఉన్నాను. ఏ క్షణామైనా మిగిలిన జట్లకు వెళ్లే ఆలోచన వచ్చినా.. నా హ్రుదయం మాత్రం ఎప్పుడూ బెంగళూరుతోనే ఉంటుంది. ఈ రోజు నేను చిన్నపిల్లలా నిద్రపోతాను. ఇది బెంగళూరు అభిమానుల గెలుపుని కోహ్లీ పేర్కొన్నారు. ఆర్సీబీ జట్టు ఎప్పుడూ ట్రోఫీని గెలవలేదు..కాబట్టి వేరే జట్టుకు వెళ్లాలనే ఆలోచన వచ్చిందన్నది అబద్ధం కాదు. కానీ నేను ఆర్సీబీలోనే భాగంగా కొనసాగాలని ధ్రుఢంగా నిర్ణయించుకున్నాను. నా మనస్సు, గుండె, ఆత్మ బెంగళూరుతోనే ముడిపడి ఉన్నాయని కోహ్లీ అన్నాడు. ఈ టైటిల్ కోసం ఫ్యాన్స్ 18ఏళ్లుగా ఎదురుచూశారు.మా జట్టు ఓడినప్పుడల్లా వాళ్ల మిమ్మల్ని వెనకనుంచి తట్టి ప్రోత్సహించారు..ఎక్కడ ఆడినా వారు మాకు తోడుగా ఉన్నారు..ఇప్పుడు వాళ్ల కల నిజమైందని అన్నారు.