India vs Engalnd 1st ODI: ఓపెనింగ్ జోడీ వారే... క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

India vs Engalnd 1st ODI: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో ఓపెనర్స్ గా వచ్చిన రోహిత్, కోహ్లీ విజయవంతమైన సంగతి తెలిసిందే.

Update: 2021-03-22 15:15 GMT
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (ఫొటో ట్విట్టర్)

India vs Engalnd 1st ODI: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో ఓపెనర్స్ గా వచ్చిన రోహిత్, కోహ్లీ విజయవంతమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు జతగా వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 80 నాటౌట్ పరుగులతో సత్తా చాటగా... రోహిత్‌ శర్మ64 అర్ధ సెంచరీ సాధించాడు. వీరితోపాటు సూర్యకుమార్‌(32), హార్దిక్‌ పాండ్యా కూడా రాణించడంతో ఇంగ్లండ్‌కు 225 పరుగుల భారీ లక్ష్యం ముందుంచింది టీమిండియా. భువీ కట్టుదిట్టమైన బౌలింగ్ పాటు నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, పాండ్యాల బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుపై 36 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఆ మ్యాచ్‌ నుంచి ఓపెనింగ్‌ జోడీపై చర్చ నడుస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి, వన్డేల్లోనూ ఇదే పాటిస్తాడా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. కొందరు మాజీలు రోహిత్ పాటు బరిలోకి దిగాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మంగళవారం(మార్చి 23) నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో కోహ్లి మీడియాతో మాట్లాడుతూ...'' శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ.. వీరే కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తారు. వన్డే ఫార్మాట్‌లో ఇందుకు సంబంధించి అనుమానాలేమీ వద్దు. గత కొన్నేళ్లుగా వారిద్దరు అద్భుతమైన భాగస్వామ్యాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు'' అని స్పష్టతనిచ్చాడు. కాగా ఈ జోడీ 107 ఇన్నింగ్సుల్లో 44.87 సగటుతో 4802 పరుగులు చేశారు.

ఇక ఓపెనర్‌గా కోహ్లీ పాత్ర ఏమిటన్న ప్రశ్నపై స్పందిస్తూ.. రోహిత్‌ చెప్పినట్లుగా మేం పటిష్టమైన వ్యూహంతోనే మొన్నటి మ్యాచ్‌లో ఓపెనింగ్‌ చేశాం. రోహిత్ తో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అయితే భవిష్యత్తులో ఇలానే కొనసాగుతుందా లేదా అంటే ఇప్పుడే చెప్పలేను. ఐపీఎల్‌లో మాత్రం ఓపెనర్‌గా బరిలోకి దిగుతాను. ఇక టీ20 వరల్డ్‌ కప్‌ నాటికి ఓపెనర్‌గా నా పాత్ర ఎలా ఉండాలన్న అంశంపై స్పష్టత వస్తుంది. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏస్థానంలో ఆడేందుకైనా నేను సిద్ధమే''అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News