Virat Kohli: 13ఏళ్ల తర్వాత ఆ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ

Update: 2025-01-27 14:41 GMT

13ఏళ్ల తర్వాత ఆ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ

Virat Kohli: టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో ఫార్మ్‌లోకి రావడం కోసం తిప్పలు పడుతున్నాడు. గత కొన్నేళ్ల నుంచి బ్యాటింగ్‌లో విఫలం అవుతున్నాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తను 9 ఇన్నింగ్స్‌లలో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ గత 5 సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్‌లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అందుకే, కోహ్లీ ఇప్పుడు రంజీ ట్రోఫీలో తన ఫార్మ్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

కోహ్లీకి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్ అయిన సంజయ్ బంగర్ సహాయం లభించింది. కోహ్లీ బంగర్ అధికారిక కోచ్‌గా ఉన్నప్పుడు 41 శతకాలు నమోదు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఆయన సహాయంతో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లీ తన కొత్త హాలిడే హోమ్ అయిన అలీబాగ్‌లో ప్రాక్టీస్ చేశాడు. అక్కడ 10,000 చదరపు అడుగుల ప్రాంగణంలో నెట్ సెషన్స్ ఏర్పాటు చేశారు.

కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడేందుకు సిద్ధమయ్యారు. 30 జనవరి నుండి ఢిల్లీలో రైల్వే జట్టుతో జరిగే మ్యాచ్‌కు ముందు కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో బంగర్ కోహ్లీకి 16 యార్డుల దూరం నుండి సిమెంట్ స్లాబ్ మీద ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇది కోహ్లీకి బ్యాక్ ఫుట్‌ పట్ల దృష్టిపెట్టే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కోహ్లీ తన కొత్త బ్యాటింగ్ పద్ధతిని అనుసరించి 41 శతకాలు చేసిన పాత కోహ్లీ తిరిగి రావాలని ఆశపడుతున్నాడు.

బంగర్ ఆధ్వర్యంలో 2014 నుండి 2019 మధ్య కోహ్లీ 11,767 పరుగులు చేసి 41 సెంచరీలను సాధించారు. అలాగే అతని టెస్ట్ సగటు 50 పైగా ఉండింది. అయితే 2020 తరువాత కోహ్లీ ఫార్మ్‌ కోల్పోయారు. 2024లో కోహ్లీ 10 టెస్ట్‌లో 19 ఇన్నింగ్స్‌లలో 24.52 సగటుతో 417 పరుగులు మాత్రమే చేశాడు.

అలాగే, 2020 నుండి 38 టెస్ట్‌లలో 31.32 సగటుతో 2005 పరుగులు చేసిన కోహ్లీ, కేవలం 3 శతకాలు, 9 అర్ధశతకాలు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు బంగర్‌తో పనిచేస్తూ కోహ్లీ తన గత వైభవాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలని చూస్తున్నాడు.

Tags:    

Similar News