US Opens 2021: యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో రికార్డు

US Opens 2021: గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న ఎమ్మా రడుకానుc

Update: 2021-09-12 03:15 GMT
యుఎస్ ఓపెన్స్ లో రికార్డు సాధించిన మహిళా

US Opens 2021: యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో రికార్డు నెలకొంది. ప్రపంచ నెంబర్ అని చెప్పుకునే వారిని మట్టి కరిపించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది ఎమ్మా రడుకాను. ఫైనల్‌లో తలపడిన ఇద్దరు యువ క్రీడాకారుల్లో.. 18 ఏళ్ల బ్రిటిష్ యువకెరటం ఎమ్మా రడుకాను చరిత్ర సృష్టించింది. మహిళ సింగిల్స్‌ టైటిల్ పోరులో కెనాడాకు చెందిన లెలా ఫెర్నాండెజ్‌పై గెలిచి కప్ కైవసం చేసుకుంది. లెలా పెర్నాండెజ్‌పై రాకెట్‌తో విరుచుకుపడింది. ప్రత్యర్ధిపై కోలుకోని దెబ్బతీసిన రడుకాను గ్రాండ్‌స్లామ్ కైవసం చేసుకుంది. వరుసగా 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది..

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 150 ర్యాంకులో కొనసాగుతున్న ఎమ్మా.. తనకన్నా మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న బ్రిటన్ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఎమ్మా చరిత్ర సృష్టించింది.

ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా గెలిచింది. యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా రడుకాను చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది ఎమ్మా.. షరపొవా తర్వాత గ్రాండ్ స్లామ్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకుంది. 17ఏళ్ల వయసులో 2004లో షరపోవా వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకుని అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది మరోవైపు ఇవాళ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్ ఫైనల్స్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌లో మెద్వెదేవ్‌తో ప్రపంచ నెంబర్ వన్‌గా ఉన్న జకోవిచ్ తలపడనున్నారు. 

Tags:    

Similar News