RCBW vs UPW: ఓపెనర్లే బాదేశారు.. యూపీ ఘన విజయం
RCBW vs UPW: ఓపెనర్లే బాదేశారు.. యూపీ ఘన విజయం
RCBW vs UPW: ఓపెనర్లే బాదేశారు.. యూపీ ఘన విజయం
RCBW vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో యూపీ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో బెంగళూరుకు ఇది వరుసగా నాలుగో పరాజయం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలీసా పెర్రీ అర్ధశతకం సాధించగా.. 36 పరుగులతో సోఫియా డివైన్ రాణించింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫియా 4, దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది. అలీసా హీలీ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోగా.. దేవిక వైద్య 36 పరుగులతో సత్తాచాటింది.