Travis Head tests COVID positive: ట్రావిస్ హెడ్ కు కోవిడ్..నేటి లక్నో మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం.!

Travis Head tests Coronavirus positive: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ బారినపడ్డాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచుకు ఆయన దూరం కానున్నాడు.

Update: 2025-05-19 06:28 GMT

Travis Head: ట్రావిస్ హెడ్ కు కోవిడ్..నేటి లక్నో మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం.!

Travis Head tests Coronavirus positive: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ బారినపడ్డాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచుకు ఆయన దూరం కానున్నాడు. సన్ రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ఈ విషయాన్ని తెలిపారు. హెడ్ కోవిడ్ బారినపడటంతో భారత్ కు రావడంలో ఆలస్యం అవుతుందని కోచ్ తెలిపారు. అయితే హెడ్ కు ఎప్పుడు ఎక్కడ కోవిడ్ వైరస్ వచ్చిందనే విషయాన్ని మాత్రం సన్ రైజర్స్ కోచ్ సమాధానం ఇవ్వలేదు. సోమవారం ఉదయం వరకు భారత్ కు చేరుకుంటాడని..వైద్య సిబ్బంది అతన్ని పరీక్షిస్తారని ఆతర్వాతే పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపాడు.

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హెడ్ కెప్టెన్ కమిన్స్ తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. జూన్ 11న ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు ఇద్దరు మళ్లీ ఐపీఎల్ లో చేరుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మిగతా మ్యాచుల కోసం హెడ్ కమిన్స్ ఇద్దరూ భారత్ కు వస్తారని సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం వెల్లడించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మే 24న చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. 

Tags:    

Similar News