IND vs NZ: ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
IND vs NZ: ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు 5 నిమిషాలకో మెట్రో రైలు
IND vs NZ: ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
IND vs NZ: ఇవాళ ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ఇవాళ జరుగనుంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగబోతుంది. హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. గాయం కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిరీస్‌కు దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2వేల500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 40 మందితో షీ టీమ్‌లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తారు.
సెల్‌ఫోన్ మినహా ఇతర వస్తువులకు స్టేడియంలోకి అనుమతి లేదు. పాసులు, టిక్కెట్లు, బీసీసీఐ అనుమతించిన కార్డులు ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి రావడానికి అనుమతి ఉంది. మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బ్లాక్ టిక్కెటింగ్, బెట్టింగ్ జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బ్లాక్ టిక్కెట్లకు సంబంధించి ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు అదనపు సర్వీసులను నడపనున్నారు. నాగోల్ నుంచి రాయదుర్గం బ్లూ లైన్ కారిడార్‌లో ఉదయం 11 నుంచి 4 గంటల వరకు మెట్రో ఫ్రీక్వెన్సీ 7 నిముషాల నుంచి 5 నిమిషాలకు కుదిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్-రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో నడుపుతామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.