Fifa World Cup 2022: ఘనంగా ఫిఫా ప్రపంచ కప్ వేడుకలు ప్రారంభం

* అల్ బేట్ స్టేడియంలో ఖతార్‌తో తలపడిన ఈక్వెడార్.. 2-0 తేడాతో ఖతార్‌ను ఓడించిన ఈక్వెడార్

Update: 2022-11-21 01:14 GMT

ఘనంగా ఫిఫా ప్రపంచ కప్ వేడుకలు ప్రారంభం

Fifa World Cup 2022: ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన సాకర్‌ వరల్డ్‌ కప్‌ ప్రారంభోత్సవం ఆదివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. ఖతార్‌ సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబిస్తూ, గత ప్రపంచ కప్‌లను అవలోకిస్తూ, ఆధునిక తరాన్ని ఆకట్టుకొనేలా సాగిన కార్యక్రమాలు 60 వేల మందితో కిక్కిరిసిన అల్‌ బయత్‌ స్టేడియాన్ని ఉర్రూతలూగించాయి. బాణసంచా కాంతులతో స్టేడియం వెలిగిపోయింది. వివిధ దేశాల జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి.

అల్‌ బేట్‌ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖతార్‌ గ్రూప్‌-ఎలో ఈక్వెడార్‌తో తలపడింది. అయితే తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆతిథ్య ఖతార్‌ను ఈక్వెడార్‌ జట్టు 2-0 తేడాతో ఓడించింది. తొలి సగభాగంలో ఎన్నర్‌ వాలెన్సియా రెండు గోల్స్‌ కొట్టి ఈక్వెడార్‌ను ముందంజలో నిలిపాడు. ఇక చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ఈక్వెడార్‌ విజయం సాధించింది. 16వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీని ఉపయోగించుకొని గోల్‌ చేసిన వాలెన్సియా, అనంతరం 30వ నిమిషంలో ఏంజెలో ప్రిసియాడో అందించిన బంతిని తలతో అద్భుతంగా గోల్‌పోస్టులోకి నెట్టాడు.

ఈ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు జట్ల చొప్పున 8 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ స్థాయిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుతాయి. ఇక ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఈక్వెడార్‌ 44వ స్థానంలో ఉండగా, ఖతార్‌ 50వ స్థానంలో ఉంది. 

Tags:    

Similar News