Tokyo Olympics: నిరాడంబరంగా టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలు

* అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు * బాణసంచా వెలుగులు, జపాన్ పాప్ సంగీతం హోరు

Update: 2021-08-08 14:00 GMT

టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలు(ట్విట్టర్ ఫోటో)

Tokyo Olympics: విశ్వ సంగ్రామం ముగిసింది. టోక్యో ఒలింపిక్స్‌ 2020కు తెరపడింది. కరోనా నిబంధనల కారణంగా ముగింపు వేడుకలను అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగానే జరిగాయి. జపాన్ జాతీయ స్టేడియంలో జరిగిన ఈ ముగింపు వేడుకలు కనువిందు చేశాయి. బాణసంచా వెలుగులు, జపాన్ పాప్ సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌, పలువురు ప్రముఖుల ప్రసంగం అనంతరం పారిస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌కు సంబంధించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో టోక్యో మహా సంగ్రామం ముగిసింది.

మరోవైపు ముగింపు సంద‌ర్భంగా మ‌రోసారి అన్ని దేశాల‌కు చెందిన అథ్లెట్లు త‌మ జాతీయ ప‌తాకాల‌తో స్టేడియంలోకి వ‌చ్చారు. భారత్ త‌ర‌ఫున రెజ్లర్ భ‌జ‌రంగ్ పూనియా త్రివ‌ర్ణ ప‌తాకంతో సంద‌డి చేశాడు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణిక‌స్తున్న స‌మ‌యంలో విజ‌యవంతంగా ఈ విశ్వక్రీడా సంబ‌రాన్ని నిర్వహించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞత‌లు తెలిపారు.

Tags:    

Similar News