విశాఖ టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా విజయం

Team India: *20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసిన భారత జట్టు

Update: 2022-06-15 02:42 GMT

విశాఖ టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా విజయం

Team India: విశాఖ టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 48 పరుగుల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడిన భారత్‌... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఐదు బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది. 19 ఓవర్ల ఓ బంతికి 131 పరుగులే చేయగలిగింది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికా దూకుడుకు కళ్లెం వేయడంలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. అక్షర్ పటేల్ తొలి వికెట్ పడగొట్టి పతనానికి బీజం వేశాడు. ఆతర్వాత హర్షల్ పటేల్, యుజువేంద్ర ఛాహల్ వికెట్లను పడగొట్టి తక్కువ పరుగులకే పరిమితం చేశారు. హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు, యుజువేంద్ర ఛాహల్ మూడు వికెట్లు నమోదు చేశారు.

తొలుత ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. పది ఓవరర్లపాటు అద్భుతమైన ఆటతీరుతో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఆశాజనకంగా అడపాదడపా బౌండరీలు, సిక్సర్లతో పరుగులు సాధించారు. పదోఓవర్‌ ఆఖరు బంతికి రుతురాజ్‌గైక్వాడ్ బౌలర్‌ మహరాజ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవీలియన్ బాట పట్టాడు. 35 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ గైక్వాడ్ 7 బౌండరీలు, రెండు సిక్సర్లతో 57 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ 35 బంతులు ఎదుర్కొని ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లతో 54 పరుగులు అందించాడు. హార్థిక్ పాండ్యా 21 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 31 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ ఆరుపరుగులకే పరిమితమయ్యాడు. దినేశ్ కార్తిక్ ఆరుపరుగులు, అక్షర్ పటేల్ ఐదు పరుగులు అందించాడు. 180 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లను టీమిండియా కట్టడి చేసే ప్రయత్నంచేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో టీమిండియా తొలి విజయం సొంతంచేసుకుంది

Tags:    

Similar News