WTC Final: ఆ 42 రోజులు ఏం చేస్తారు?

WTC Final: జూన్ 2 న ఇంగ్లాండ్‌ దేశానికి టీం ఇండియా బయలుదేరనున్న సంగతి తెలిసిందే.

Update: 2021-05-31 12:30 GMT

భారత మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ (ఫొటో ట్విట్టర్)

WTC Final: జూన్ 2 న ఇంగ్లాండ్‌ దేశానికి టీం ఇండియా బయలుదేరనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిశాక, ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. అయితే, ఈ పర్యటనలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిశాక చాలా రోజుల పాటు ఖాళీగా ఉండనుంది. ఈ షెడ్యూల్‌పై భారత మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఫైర్‌ అయ్యాడు.‌ టీమిండియా 42 రోజులు ఖాళీగా ఉండనుంది. దీనిపై భారత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత పేలవమైన షెడ్యూల్‌ను ఎలా రూపొందిస్తారని, దేశం కాని దేశంలో 42 రోజుల పాటు ఖాళీగా ఉంచడం ఏమాత్రం సరికాదని వెంగ్‌సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ అయ్యాక, వెంటనే ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యేలా షెడ్యూల్ ఎందుకు రూపొందించలేదని వాపోయాడు. కాగా, దాదాపు నెలన్నర ఖాళీ సమయం తరువాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుంది.

Tags:    

Similar News