IND Vs SL: ఉత్కంఠ పోరులో శ్రీలంకపై భారత్ విజయం
IND Vs SL: తొలి టీ20లో శ్రీలంకపై టీమిండియా విక్టరీ
IND Vs SL: ఉత్కంఠ పోరులో శ్రీలంకపై భారత్ విజయం
IND Vs SL: మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా బోణి కొట్టింది. ఉత్కంఠ పోరులో తొలి టీ20లో శ్రీలంకపై 2 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో లంక 13 పరుగులు చేయాల్సి ఉండగా.. కరుణరత్నె పోరాడిన లంకకు ఓటమి తప్పలేదు. ఈ ఓవర్‌లో అక్షర్ పటేల్ 10 పరుగులు ఇచ్చాడు. టీమిండియా యువ బౌలర్ శివం మాని 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చాహెల్, హర్షల్ పటేల్ చెరే రెండు వికెట్లు తీశారు. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకా ఒక్కడే 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లు చెతులెత్తేశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ విజృంభించారు. హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు. అనంరతం చేధనకు దిగిన శ్రీలంక 160 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది.