India vs Pakistan: పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా

India vs Pakistan: ఐదు వికెట్లప్రదర్శనతో సత్తా చాటిని కులదీప్ యాదవ్

Update: 2023-09-12 02:05 GMT

India vs Pakistan: పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా

India vs Pakistan: ఆసియా కప్‌ క్రికెట్ పోటీల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్‌పై 228 పరుగుల తేడా విజయ దుంధుబి మోగించింది. ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌ నిన్న ప్రారంభమైన తర్వాత వరుణ దేవుడు ఆటంక పరిచారు. 24 ఓవర్ల ఓ బంతికి భారీ వర్షం కురిసింది. దీంతో ఆటకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇవాళ రిజర్వు డే కావడంతో నిన్న ఆగిపోయిన మ్యాచ్‌నుంచి ఇవాళ కొలంబో ప్రేమదాసస్టేడియాం వేదికగా ఆట మొదలైంది. క్రీజులో ఉన్న లోకేశ్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో సెంచరీలు నమోదు చేసి అజేయంగా నిలిచారు.

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 56 పరుగులు, శుభ్ మన్‌గిల్ 58 పరుగులు తొలిరోజు నమోదు చేయగా... క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 9 బౌండరీలు 3 సిక్సర్లతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. లోకేశ్ రాహుల్ 106 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సర్లతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. మొత్తంమీద విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్ అద్భుతమైన సెంచరీలతో భారత్ జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టారు.

357 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభమైనప్పటికీ... 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు 228 పరుగుల తేడాలో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

టీమిండియా బౌలర్ కులదీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆటను నియంత్రించగలిగాడు. కీలకమైన బ్యాట్స్ మెన్ల వికెట్లను పడగొట్టి భారత్ జట్టుకు తరఫున ఐదు వికెట్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. 8 ఓవర్లు వేసిన కులదీప్ యాదవ్ 25 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టి అద్భుత గణాంకాలను నమోదు చేయడంతోపాటు... భారత జట్టుకు ఘనవిజాన్ని సాధించిపెట్టడంలో కీలక పాత్రపోషించాడు.

Tags:    

Similar News