Pink Ball Test Match 2021: మిథాలీసేన.. పింక్ బాల్ టెస్ట్

చరిత్రలో తొలిసారి మిధాలిసేన పింక్ బాల్ టెస్టు ఆడనుంది. ఈ ఏడాది చివరిలోగా ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టులో టీం ఇండియా ఉమెన్స్ తలపడనుంది.

Update: 2021-05-20 11:22 GMT

ఇండియా ఉమెన్స్ ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్/ఐసీసీ)

Pink Ball Test Match 2021: చరిత్రలో తొలిసారి మిధాలిసేన పింక్ బాల్ టెస్టు ఆడనుంది. ఈ ఏడాది చివరిలోగా ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టులో టీం ఇండియా ఉమెన్స్ తలపడనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జేషా ట్విట్టర్లో పేర్కొన్నాడు.

'మహిళల క్రికెట్‌ లో ముందడుగు పడింది. మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీసీసీఐ కట్టుబడి ఉంది. చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు పింక్ బాట్ టెస్టు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో డే/నైట్‌ టెస్టు ఆడనుంది. ఈ విషయం ప్రకటించేందుకు చాలా సంతోషిస్తున్నాం' అని బీసీసీఐ కార్యదర్శి జే షా ట్వీట్టర్ లో ప్రకటించారు.

కాగా, ఇప్పటి వరకు ఇండియా మెన్స్ టీం మాత్రమే పింక్ బాల్ టెస్టులు చాలాసార్లు ఆడారు. ఇప్పుడు ఉమెన్స్ టీమ్ కూడా పింక్ టెస్టు బరిలోకి దిగుతుంది. మహిళల క్రికెట్లో ఇది రెండో డే/నైట్‌ టెస్టు కావడం విశేషం. మొదటి పింక్ బాల్ టెస్టు ఆసీస్‌, ఇంగ్లాండ్‌ ఉమెన్స్ టీంల మధ్య 2017లో సిడ్నీలో జరిగింది.

ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు బయలుదేరనుంది. 2014 తర్వాత భారత మహిళల టీం తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. జూన్‌ 16న ఇంగ్లాండ్‌ తో టెస్టు మ్యాచ్ ఆడనుంది. మిథాలీరాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆ తర్వాత ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు, 3 టీ20ల్లో ఇండియా ఉమెన్స్ పోటీ పడనున్నారు. అనంతరం సెప్టెంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలోనే పింక్ బాల్ టెస్టు ఆడనున్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News