రాజ్‌కోట్ టీ-ట్వంటీలో టీమిండియా విజయభేరి

India vs South Africa: టీట్వంటీల్లో రెండో విజయాన్ని నమోదుచేసిన టీమిండియా

Update: 2022-06-18 01:52 GMT

రాజ్‌కోట్ టీ-ట్వంటీలో టీమిండియా విజయభేరి

India vs South Africa: రాజ్‌‌కోట్ వేదికగా దక్షిణాఫ్రితో జరుగుతున్న టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా విజయభేరి మోగించింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న దక్షిణాఫ్రికాపై వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసి సమంచేసింది. సిరీస్ కైవసం చేసుకోడానికి ఇరుజట్లు సమ ఉజ్జీలుగా బెంగళూరులో జరుగనున్న ఐదో మ్యాచులో తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా... మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అరు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చతికిల పడింది. భారత బౌలర్లు అద్భుతమైన బంతులు సంధించి బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించారు. భారత బౌలర్‌ ఆవేశ్ ఖాన్ తనదైన శైలిలో బంతుల్ని సంధించి కీలకమైన వికెట్లను పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో టాప్‌ ఆర్డర్ రాణించలేకపోవడంతో పరాజయాన్ని చవిచూసింది. టీమిండియా తరఫున దినేశ్ కార్తిక్ అద్భుతమైన ఆటతీరుతో గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. వ్యక్తిగతంగా 27 బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ 9 బౌండరీలు, రెండు సిక్సర్లతో 55 పరుగులు అందించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

హార్థిక్ పాండ్యా బ్యాట్‌ ఝుళిపించి 31 బంతుల్లో 3 బౌండరీలు, 3 సిక్సర్లతో 46 పరుగులు నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ 27 పరుగులు అందించాడు. రిషబ్ పంత్ 17 పరుగులతో నిలిచాడు. 16 ఓవర్ల 5 బంతుల్లో 87 పరుగులతో దక్షిణాఫ్రికా ఆలౌటైంది. ఆవేశ్ ఖాన్, ఛాహల్ బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయం చేజిక్కించుకుంది.

Tags:    

Similar News