Jasprit Bumrah: విరామం లేకపోవడమే టీమిండియా ఓటమికి కారణం

* విరామం లేకుండా వరుసగా మ్యాచ్ లు ఆడటమే ఓటమికి కారణం

Update: 2021-11-01 12:58 GMT

జస్ప్రిత్ బుమ్రా(ట్విట్టర్ ఫోటో)

Jasprit Bumrah: టీమిండియా ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు వరుస పరాజయాలపై తాజాగా స్పందించాడు. టీమిండియా ఆటగాళ్ళకు విరామం లేకుండా వరుస షెడ్యుల్ లతో పాటు బయోబుల్ ఉండటం వలన ఆటగాళ్ళ మానసిక పరిస్థితిపై అది ప్రభావం చూపిస్తుందని తెలిపాడు. ఆరు నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా వరుస మ్యాచ్ లతో పాటు బయోబబుల్ లో ఉండటంతో ఆటగాళ్ళు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు బుమ్రా చెప్పుకొచ్చాడు.

ఆటగాళ్లంతా సౌకర్యంగా ఉండటానికి తమకు అన్ని విధాలుగా బిసిసిఐ యాజమాన్యం సహకరిస్తుందని, బయోబబుల్ లో ఉండటానికి ఆటగాళ్ళు కూడా అలవాటు పడుతున్నారని బుమ్రా తెలిపాడు. వరుస మ్యాచ్ లలో టీమిండియా విఫలమవడంతో సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ళకు విరామం లేకపోవడం వల్లే ఆటలో విఫలం చెందుతున్నారని కామెంట్స్ చేయడంతో పాటు వరుస శ్రీలంక టూర్, ఇంగ్లాండ్ టూర్, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ షెడ్యుల్ ని రూపొందించిన బిసిసిఐపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా ప్రపంచకప్ లో సెమీస్ ఆశలను వదులుకోగా రానున్న మూడు మ్యాచ్ లలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తుంది.

Tags:    

Similar News