Asia Cup 2022: ఆసియా కప్‌ పోటీల్లో టీమిండియా ఘన విజయం

Asia Cup 2022: రెండు వరుసవిజయాలతో సూపర్ 4కు అర్హత

Update: 2022-09-01 01:53 GMT

Asia Cup 2022: ఆసియా కప్‌ పోటీల్లో టీమిండియా ఘన విజయం

Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన పోటీల్లో హాంకాంగ్‎తో తలపడిన టీమిండియా సాధికార విజయంతో గ్రూప్ Aనుంచి సూపర్ ఫోర్ లోకి ప్రవేశించింది. టాస్ గెలిచిన హాంగ్‌కాంగ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కి దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేశ్ రాహులు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లనష్టానికి 192 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 21 పరుగుల సాధించి టీ20 మ్యాచ్‌ల్లో 3వేల500 పరుగుల మైలు రాయిని అధిగమించిన తొలిఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నారు. లోకేశ్ రాహుల్ 36 పరుగులు అందించారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

విరాట్ కోహ్లీ44 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీ, మూడు సిక్సర్లతో 59 పరుగులు అందించి అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ తొలినుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 26 బంతులు ఎదుర్కొని ఆరు బౌండరీలు, ఆరు సిక్సర్లతో 68 పరుగులు అందించాడు. సూర్యకుమార్, కోహ్లీతో కలిసి జట్టుకు భారీ స్కోరును అందించారు.

193 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్‌కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ఆసియా కప్ పోటీల్లో రెండు వరుస విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి సూపర్ ఫోర్ కు అర్హత సాధించింది. జట్టు విజయంలో భారీ స్కోరు సాధనతో కీలక పాత్రపోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Full View


Tags:    

Similar News