IND vs SL: జనవరి 3న ముంబైలో శ్రీలంకతో టీమిండియా తొలి టీ20
IND vs SL: 2023 కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించే వ్యూహం
IND vs SL: జనవరి 3న ముంబైలో శ్రీలంకతో టీమిండియా తొలి టీ20
IND vs SL: బంగ్లాపై టెస్టు సిరీస్ విజయంతో 2022ను ముగించిన టీమ్‌ఇండియా కొత్త సంవత్సరంలోనూ అదే జోష్ ప్రదర్శించాలని ఉవ్వీళ్లూరుతోంది. కొత్త ఏడాదిలో ఈ నెల మూడో తేదీ నుంచే శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించిన స్క్వాడ్‌లను ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అందుబాటులో లేరు. అయితే వన్డే సిరీస్‌లో ఆడతారు. రెండు సిరీసుల్లోనూ ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్‌కు చోటు కల్పించలేదు. అతడి స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చింది. అయితే తుది జట్టులో ఉండేందుకు ఇషాన్ కిషన్‌తో సంజూ పోటీ పడకతప్పదు. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించి ఇషాన్ మంచి ఊపుమీదున్నాడు.