Virat Kohli: రహానే ఫామ్‌ గురించి నేను మాట్లాడను..అతడికి అండగా ఉంటాం

* సోమవారం రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2021-12-07 10:03 GMT

Virat Kohli: రహానే ఫామ్‌ గురించి నేను మాట్లాడను..అతడికి అండగా ఉంటాం

Virat Kohli: ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో 372 పరుగుల భారీ తేడాతో సోమవారం ఘనవిజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా అజింక్య రహనే ఫామ్ ఆరోపణలు వస్తున్న తరుణంలో విరాట్ కోహ్లి ఆ విషయంపై స్పందించాడు.

విరాట్ కోహ్లి మాట్లాడుతూ "రహానే ఫామ్‌ గురించి జడ్జ్‌ చేయలేను. నేనే కాదు ఎవరూ ఆ పని చేయలేరు. తమ లోపాలేమిటి? వాటి నుండి ఎలా పరిష్కరించుకోవాలో ఆ ఆటగాడు దృష్టి సారించాల్సి ఉంటుంది. కీలక మ్యాచ్‌ల్లో తమ ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగలిగే ఆటగాళ్లకు కష్టకాలంలో మద్దతుగా నిలుస్తామని" అజింక్యా రహానేకు మరోసారి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.

ఇక విరాట్ కోహ్లి స్థానంలో మొదటి టెస్ట్ కి కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహనే.. మొదటి ఇన్నింగ్స్ లో 35 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగుల పేలవ ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక కోహ్లి రాకతో రెండో టెస్ట్ లో శ్రేయాస్ పై వేటు పడుతుందని భావించిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ ని జట్టులో ఉంచి రహనేని పక్కనపెట్టారు.

Tags:    

Similar News