డ్రగ్స్ కేసులో బుక్కైన శ్రీలంక క్రికెటర్

శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్‌ పేసర్‌ షెహన్‌ ముదషనక(25) డ్రగ్స్‌‌ కేసులో అరెస్ట్‌‌ అయ్యాడు.

Update: 2020-05-26 05:44 GMT
Shehan Madushanka (File Photo)

శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్‌ పేసర్‌ షెహన్‌ ముదషనక(25) డ్రగ్స్‌‌ కేసులో అరెస్ట్‌‌ అయ్యాడు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆదివారం వ్యక్తితో కలసి కారులో ప్రయాణిస్తున్న శేహన్ మధుశంకను పన్నాల పోలీసులు ఆపి తనిఖీ చేయగా..హెరాయిన్‌ డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు దొరికాడు. దాంతో అతనిడి అరెస్ట్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడనే అభియోగాలతో కేసు నమోదు చేసి స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 2 వారాల రిమాండ్‌లో ఉంచాల్సిందిగా మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించినట్లు శ్రీలంకలోని స్థానిక న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

2018జనవరిలో బంగ్లాదేశ్‌ తో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌ లో అడుగుపెట్టిన షనక ఆ మ్యాచ్‌ లోహ్యాట్రిక్‌‌ తీసి సంచలనం సృష్టించాడు. శ్రీలంక తరఫున ఏకైక వన్డే, రెండు టీ20లు మాత్రమే ఆడాడు. అరంగేట్రంలొనే మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్ పడగొట్టి ఘనంగా చాటుకున్నాడు. బంగ్లాపై రెండు వన్డేలు ఆడి ఏడు పరుగులు చేసాడు. ఆ తర్వాత గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.


Tags:    

Similar News