తొలి టీ-20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం

South Africa: *భారత్‌పై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలుపు

Update: 2022-06-10 01:19 GMT

తొలి టీ-20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం

South Africa: టీమిండియా, సౌతాఫ్రికా మధ్య ఉత్కంఠగా సాగిన తొలి టీ-20లో సఫారీలు బోణి కొట్టారు. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ పై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాప్రియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ ను మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే చేధించారు. మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లోనే టార్గెట్ ను చేధించారు. మ్యాచ్ మధ్యలో సఫారీలు చతికిలపడుతున్నారని భావించిన సమయంలో డేవిడ్ మిల్లర్, డస్సెన్ మ్యాచ్ ను మలుపు తిప్పారు. డస్సెన్ 46 బంతుల్లో 75 పరుగులు చేయగా మిల్లర్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. అనూహ్యంగా దక్షిణాఫ్రికా విజయాన్ని అందించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది భారత జట్టు. భారత్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ 76 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 36 పరుగులు చేశారు రుతరాజ్ గైక్వాడ్ 23, రిషబ్ పంత్ 29, హార్ధిక్ పాండ్యా 31 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కేశవ్ మహరాజ్, పిట్రోరియస్, పార్ నెల్, నార్జ్ తలో వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్ లో టీమిండియా పరాజయం పాలయ్యింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశింటినప్పటికీ సఫారీ బ్యాట్స్ మెన్ల చేతిలో ఓటమి చెందారు. 212 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో పూర్తి చేశారు సౌతాప్రికా టీం మెంబర్స్. డుస్సేన్ 66, మిల్లర్ 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టీ.20 సీరిస్ లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. 

Tags:    

Similar News