Smriti Mandhana: భారత మహిళ క్రికెటర్ స్మృతి మందానకి అరుదైన రికార్డు
Smriti Mandhana Creates History: అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళ క్రికెటర్ స్మృతి మందాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Smriti Mandhana: భారత మహిళ క్రికెటర్ స్మృతి మందానకి అరుదైన రికార్డు
Smriti Mandhana Creates History: అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళ క్రికెటర్ స్మృతి మందాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20లలో 4 వేలు పరుగులు చేసిన రెండవ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనతను సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన స్మృతి ఈ రికార్డును నమోదు చేసింది.
స్మృతి 154 మ్యాచుల్లో 4 వేల 7 రన్స్ చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధ సెంచరీలు చేసింది. మందాన అతి పిన్న వయస్కులోనే ఈ రికార్డ్‌ను కైవసం చేసుకోవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.