SL vs HK Asia Cup : హాంకాంగ్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆరు క్యాచ్‌లు వదిలేసి శ్రీలంక చేతిలో ఓటమి
ఆసియా కప్ 2025లో శ్రీలంక తమ రెండో విజయాన్ని నమోదు చేసి సూపర్-4 దిశగా మరో అడుగు వేసింది. సోమవారం, సెప్టెంబర్ 15న దుబాయ్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో శ్రీలంక, హాంకాంగ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంకకు ఇది రెండు మ్యాచ్‌లలో రెండో విజయం కాగా, హాంకాంగ్ టోర్నమెంట్‌లో తమ మూడవ, చివరి మ్యాచ్‌లో కూడా ఓటమిని చవిచూసింది.
SL vs HK Asia Cup : హాంకాంగ్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆరు క్యాచ్‌లు వదిలేసి శ్రీలంక చేతిలో ఓటమి
SL vs HK Asia Cup : ఆసియా కప్ 2025లో శ్రీలంక తమ రెండో విజయాన్ని నమోదు చేసి సూపర్-4 దిశగా మరో అడుగు వేసింది. సోమవారం, సెప్టెంబర్ 15న దుబాయ్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో శ్రీలంక, హాంకాంగ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంకకు ఇది రెండు మ్యాచ్‌లలో రెండో విజయం కాగా, హాంకాంగ్ టోర్నమెంట్‌లో తమ మూడవ, చివరి మ్యాచ్‌లో కూడా ఓటమిని చవిచూసింది. కానీ ఈ విజయం కోసం శ్రీలంక చాలా కష్టపడాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం హాంకాంగ్ జట్టు 6 క్యాచ్‌లను జారవిడచడమే.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ మొదట బ్యాటింగ్ చేసి, శ్రీలంక లాంటి స్ట్రాంగ్ జట్టు ముందు అద్భుతమైన ప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. జిషాన్ అలీ (23), అన్షి రత్నే 5 ఓవర్లలో 41 పరుగులు చేసి మంచి ఓపెనింగ్ అందించారు. ఆ తర్వాత నిజాకత్ ఖాన్ (52) తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. నిజాకత్ రత్ (48)తో కలిసి మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీని సహాయంతో హాంకాంగ్ 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది, ఇది ఈ టోర్నమెంట్‌లో వారి అత్యధిక స్కోరు.
మరోవైపు శ్రీలంక ఇన్నింగ్స్ నెమ్మదిగా, చాలా చెత్తగా ప్రారంభమైంది. నాలుగో ఓవర్‌లోనే 26 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది, పది ఓవర్ల తర్వాత రెండో వికెట్ కూడా కోల్పోయింది. అయితే అప్పటికి స్కోరు కేవలం 65 పరుగులు మాత్రమే. ఇక్కడి నుండి స్టార్ ఓపెనర్ పతుం నిస్సాంక గేర్ మార్చి హాంకాంగ్ బౌలర్లను టార్గెట్ చేసుకున్నాడు. కానీ వారి బౌలింగ్ కంటే ఎక్కువగా ఫీల్డింగ్‌లో అనుభవం, నైపుణ్యం లేకపోవడం కనిపించింది, హాంకాంగ్ ఆటగాళ్లు 6 క్యాచ్‌లను వదిలేశారు.
ఒక దశలో హాంకాంగ్ ఫీల్డర్లు వరుసగా నాలుగు ఓవర్లలో నాలుగు క్యాచ్‌లు జారవిడిచారు. దీనిని శ్రీలంక బాగా ఉపయోగించుకుంది. దీని సహాయంతో నిస్సాంక (68) తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే, 16వ ఓవర్ నుండి మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. నిస్సాంక, కుశాల్ పెరీరా వరుసగా రెండు బంతుల్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఓవర్‌లోనే కెప్టెన్ చరిత్ అసలంక, 18వ ఓవర్‌లో కమీందు మెండిస్ కూడా అవుట్ అయ్యారు. కేవలం 13 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయిన తర్వాత శ్రీలంక కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది.. కానీ వానిందు హసరంగా కేవలం 9 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.