Team India: ఎడ్జ్‌బాస్టన్‌లో 42 ఏళ్ల నాటి అద్భుతం.. చరిత్ర సృష్టించిన సిరాజ్-ఆకాష్
Team India: ఇంగ్లాండ్ పర్యటనలో శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ప్రతి మ్యాచ్‌తో, ప్రతి ఇన్నింగ్స్‌తో ఏదో ఒక రికార్డును నమోదు చేస్తోంది. లీడ్స్ టెస్ట్‌లో ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించారు.
Team India: ఎడ్జ్‌బాస్టన్‌లో 42 ఏళ్ల నాటి అద్భుతం.. చరిత్ర సృష్టించిన సిరాజ్-ఆకాష్
Team India: ఇంగ్లాండ్ పర్యటనలో శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ప్రతి మ్యాచ్‌తో, ప్రతి ఇన్నింగ్స్‌తో ఏదో ఒక రికార్డును నమోదు చేస్తోంది. లీడ్స్ టెస్ట్‌లో ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసి రికార్డు బుక్‌ను మార్చేశాడు. లీడ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి రికార్డులు సృష్టించగా, ఎడ్జ్‌బాస్టన్‌లో అదే పనిని మహ్మద్ సిరాజ్ చేశాడు. అతనికి ఆకాష్ దీప్ తోడుగా నిలిచాడు. టీమిండియాకు చెందిన ఈ ఇద్దరు పేస్ బౌలర్లు ఎడ్జ్‌బాస్టన్‌లో అన్ని 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు.
టెస్ట్ సిరీస్‌లోని రెండో మ్యాచ్ మూడో రోజు టీమిండియా ఇంగ్లాండ్‌ను 407 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ ల మధ్య 300 పరుగులకు పైగా కీలక భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్‌ను ఈ స్కోరుకే కట్టడి చేయడంలో జట్టులో అత్యంత సీనియర్ పేసర్ అయిన సిరాజ్ ముఖ్య పాత్ర పోషించాడు. జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో ఈ మ్యాచ్‌లో సిరాజ్ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన పేస్ బౌలర్. అతను తన ప్రదర్శనతో అది నిరూపించుకున్నాడు.
సిరాజ్ మ్యాచ్ రెండో రోజు చివరిలోనే మొదటి వికెట్ తీశాడు. ఆపై మూడో రోజు రెండో ఓవర్‌లోనే జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ లను వరుస బంతుల్లో అవుట్ చేసి ఇంగ్లాండ్‌ను షాక్‌కు గురిచేశాడు. ఆ తర్వాత మూడో సెషన్‌లో సిరాజ్ ఇంగ్లాండ్ చివరి 3 వికెట్లను కూడా తీసి, 6 వికెట్లతో చరిత్ర సృష్టించాడు. సిరాజ్ తన కెరీర్‌లో నాలుగోసారి ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.
మరోవైపు, ఆకాష్ దీప్ మిగిలిన 4 వికెట్లను తీశాడు. రెండో రోజు మొదట్లోనే ఇంగ్లాండ్‌కు వరుస షాక్‌లు ఇచ్చింది ఆకాష్ దీపే. ఆ తర్వాత స్మిత్, బ్రూక్ 300 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకు వికెట్లు దొరకనప్పుడు ఆకాష్ దీప్ కొత్త బంతితో ఆ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆకాష్ మొదట బ్రూక్‌ను, ఆపై క్రిస్ వోక్సను అవుట్ చేశాడు.
ఈ విధంగా సిరాజ్, ఆకాష్ దీప్ కలిసి ఈ ఇన్నింగ్స్‌లో అన్ని 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశారు. ఈ ఇద్దరు బౌలర్ల ఈ అద్భుత ప్రదర్శన 42 ఏళ్ల క్రితం నాటి చరిత్రను పునరావృతం చేసింది. భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఓపెనింగ్ బౌలర్లు ఒకే ఇన్నింగ్స్‌లో అన్ని 10 వికెట్లు తీయడం ఇది నాలుగోసారి మాత్రమే. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు, ఈ అద్భుతం 42 సంవత్సరాల క్రితం 1983లో అహ్మదాబాద్‌లో జరిగింది. అప్పుడు కపిల్ దేవ్, బల్విందర్ సంధు వెస్టిండీస్‌పై 10 వికెట్లు తీశారు. అప్పట్లో కపిల్ 9 వికెట్లు, సంధు 1 వికెట్ తీశారు.