Shubman Gill: శుభ్‌మన్ గిల్‌ అద్భుత ఫామ్.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు పడిపోయేనా?

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గరంగరంగా ఆడుతున్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే 585 పరుగులు చేసి తన సత్తా చాటేశాడు.

Update: 2025-07-06 12:17 GMT

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌ అద్భుత ఫామ్.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు పడిపోయేనా?

Shubman Gill : ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గరంగరంగా ఆడుతున్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే 585 పరుగులు చేసి తన సత్తా చాటేశాడు. ఇంకా మూడు టెస్ట్‌లు మిగిలి ఉండటంతో, క్రికెట్ చరిత్రలోని ఒక అత్యంత ప్రాచీనమైన రికార్డు  డాన్ బ్రాడ్‌మన్ 1930లో సాధించిన 974 పరుగుల సిరీస్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో వాలీ హేమండ్, నీల్ హార్వే, వివ్ రిచర్డ్స్, క్లైడ్ వాల్కట్ లాంటి దిగ్గజాలు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనతను పొందినా, భారత ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ తర్వాత శుభ్‌మన్ గిల్ ఇప్పటికే మూడో స్థానంలో నిలిచాడు.

గిల్ ప్రస్తుత పర్యటనలో ఫస్ట్ టెస్ట్‌లో 147 పరుగులు, రెండో టెస్ట్‌లో 269 మరియు 161 పరుగులు సాధించాడు. ఈ లెక్కన మూడు మ్యాచ్‌లు ఇంకా మిగిలి ఉండటంతో బ్రాడ్‌మన్ రికార్డుపై గిల్ కన్నేశాడన్న మాట.

ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ చారిత్రక విజయం దిశగా సాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో గిల్ మరోసారి సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. భారత్ మొత్తంగా 427/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, ఇంగ్లండ్ 608 పరుగుల లక్ష్యానికి ఛేదనలో 72/3తో నిలిచింది. చివరి రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యం కావొచ్చు కానీ, టీమిండియా ఇప్పటికీ విజయానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఈ మ్యాచ్‌ను గెలిపిస్తే భారత్‌కు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదే తొలి గెలుపు అవుతుంది. అదే సమయంలో గిల్ మరిన్ని పరుగులు చేసి కొత్త చరిత్రకు నాంది పలికే అవకాశం ఉంది.

Tags:    

Similar News