Shubman Gill: అతడే అర్హుడు అంటూ.. శుభ్‌మాన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించిన రికీ పాంటింగ్

Shubman Gill: టీం ఇండియాకు చెందిన పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్ కొత్తగా వరల్డ్ నంబర్ 1గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2025-02-22 05:36 GMT

Shubman Gill: అతడే అర్హుడు అంటూ.. శుభ్‌మాన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించిన రికీ పాంటింగ్

Shubman Gill Shines With Magnificent Century


Shubman Gill: టీం ఇండియాకు చెందిన పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్ కొత్తగా వరల్డ్ నంబర్ 1గా మారిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్‌లో అద్భుతమైన శతకంతో భారత్‌ను ఆరు వికెట్లతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో శుభమాన్ గిల్ మరొక శతకం సాధించి వన్డే క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించాడు. ఇది తనకు వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం.

మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అతడి ఆట తీరు పై ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ నెంబర్ 1 ర్యాంక్‌కు చేరుకోవడం ఆటపై తన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఐసీసీ రివ్యూ ప్రోగ్రామ్‌లో పాంటింగ్ మాట్లాడుతూ.. "గిల్ ఈ నంబర్ 1 ర్యాంక్‌కు పూర్తిగా అర్హుడు. ఈ విజయంతో చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు అతను మంచి సంకేతాలు అందించాడు" అని అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో శుభమాన్ గిల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చూపకపోయినా పాంటింగ్ చెప్పినట్లుగా వన్డేలు, టీ20లలో మాత్రం మంచి ప్రదర్శన అందిస్తున్నారు. శుభమాన్ గిల్ వన్డేలు, టీ20 ఫార్మాట్ లలో మంచి ప్రదర్శన చూపించిన ఆటగాడు. ఐపీఎల్‌లో కూడా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని పాంటింగ్ చెప్పుకొచ్చారు.

గిల్ ఫాస్ట్ బౌలింగ్ లో కూడా బౌండరీలు సాధించడం, అన్ని సమయాల్లోనూ గిల్ భారత జట్టును ఆదుకోవడం చూసి రికీ పాంటింగ్ ఇంప్రెస్ అయ్యారు. దుబాయిలో బంగ్లాదేశ్‌తో 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శుభమాన్ గిల్ తన కెరీర్లో చేసిన 8వ సెంచరీ అతడికి భారత క్రికెట్‌లో ప్రీమియర్ వైట్ బాల్ బ్యాటర్‌గా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

Tags:    

Similar News