Shubman Gill: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? గిల్‌కు టెస్టింగ్ టైం
Shubman Gill: ఐపీఎల్ 2025 మధ్యలో రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో తర్వాతి కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది.
Shubman Gill: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? గిల్‌కు టెస్టింగ్ టైం
Shubman Gill: ఐపీఎల్ 2025 మధ్యలో రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో తర్వాతి కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది. సహజంగానే శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రస్తుత సెలక్షన్ కమిటీకి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు.
జూన్‌లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌తోనే భారత జట్టు తర్వాతి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ కొనసాగుతాడా లేదా సెలక్షన్ కమిటీ అతన్ని తొలగిస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో రోహిత్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
దీంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొత్త కెప్టెన్‌ను ఎన్నుకోవడం అతి పెద్ద సవాలుగా మారింది. ఈ రేసులో స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ పేరు ముందు వరుసలో ఉంది. అతను వన్డే జట్టులో వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే, గిల్ పేరును ప్రకటించే ముందు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అగార్కర్, అతని కమిటీకి ఒక సలహా ఇచ్చాడు. గిల్‌ను కెప్టెన్‌గా నియమించే ముందు ఇంగ్లాండ్‌లో అతని ప్రదర్శనను పరిశీలించాలని సూచించాడు.
ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ, "గిల్, జస్ప్రీత్ బుమ్రా మంచి ఆప్షన్లు. వారిద్దరినీ పరిశీలిస్తున్నారు. ఇంగ్లాండ్ లాంటి సిరీస్‌తో, మీరు ఎవరిపైనా ఒత్తిడి పెట్టకూడదని నేను భావిస్తున్నాను. శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్‌లో ఒక మంచి సిరీస్ ఆడాలి, తద్వారా అతను తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టగలడు. కాబట్టి బుమ్రా ఒక అద్భుతమైన ఎంపిక అని నేను భావిస్తున్నాను. బుమ్రాతో ప్రారంభించి గిల్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడంలో ఎలాంటి సందేహం లేదు" అని అన్నాడు.