IPL 2025: ఐపీఎల్‌లో అసలుసిసలైన కెప్టెన్.. అసలు షో ఆఫ్‌ అంటేనే తెలియని లీడర్!

IPL 2025: ఈసారి IPL‌లో నిజంగా సత్తా చూపించిన కెప్టెన్ ఎవరో స్పష్టంగా కనిపిస్తున్నాడు.

Update: 2025-04-10 14:59 GMT

IPL 2025: ఐపీఎల్‌లో అసలుసిసలైన కెప్టెన్.. అసలు షో ఆఫ్‌ అంటేనే తెలియని లీడర్!

IPL 2025:తలపై విమర్శల తూటాలు పడినా, వాటిని తట్టుకుని మళ్ళీ పైకి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. తాను తలపెట్టి సాధిస్తానని చూపించాడు. ఎన్నో ఆటుపోటుల అనంతరం ఇప్పుడు అదే అయిపోయింది అతడి బలం. తనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కి జవాబుగా ప్రతీ ఇన్నింగ్స్‌లో ఆటతోనే సమాధానం ఇస్తున్నాడు. కెప్టెన్సీలో, బ్యాటింగ్‌లో ఏకకాలంలో అద్భుతంగా నడిపిస్తున్నాడు.

ఒకప్పుడు 'ఇతనికి కెప్టెన్సీ సూటవదా?', 'ఇతను టీమ్‌ను ఎలా నడుపుతాడు?' అంటూ ప్రశ్నించినవాళ్లే ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఆటపట్ల అంకితభావం, జట్టు పట్ల నిబద్ధత, విఫలమైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడం వంటి లక్షణాలు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్‌ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తన వ్యక్తిగత ఘనత కన్నా టీమ్ విజయం ముఖ్యం అనే భావనతో ఆడుతున్నాడు. తన ఇన్నింగ్స్‌ను మధ్యలో ఆపేసినా, తన జట్టుకి స్కోరు బలంగా ఉండాలనే తపనతో ఆ నిర్ణయం తీసుకోవడం లాంటి సంఘటనలు శ్రేయస్‌లో ఉన్న లీడర్‌షిప్‌ను ప్రతిబింబిస్తున్నాయి. మిగతా ఆటగాళ్ల విజయాన్ని మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేయడం ద్వారా ఆత్మీయతను, జట్టు స్పిరిట్‌ను చూపిస్తున్నాడు.

ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి చూస్తే.. వాతావరణం మొత్తం మారిపోయినట్లు ఉంది. మొన్నటి వరకు పరాజయాల బాటలో ఉన్న టీమ్ ఇప్పుడు టైటిల్ కోసం పోటీపడుతోంది అంటే, అది కచ్చితంగా శ్రేయస్ అయ్యర్‌ మేనేజ్‌మెంట్‌, గేమ్‌ప్లాన్‌, గట్టిగా నిలబడిన విల్‌పవర్ ఫలితం.

Tags:    

Similar News