TNPL 2025: 12 సిక్సర్లతో 198 పరుగులు.. ఐపీఎల్ లో స్థానం దక్కని ప్లేయర్ విశ్వరూపం
TNPL 2025: ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 తుది అంకానికి చేరుకుంది. ఈ లీగ్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో స్థానం దక్కని ఆటగాళ్లు ఈ లీగ్‌లో పరుగుల వరద పారిస్తున్నారు.
TNPL 2025: 12 సిక్సర్లతో 198 పరుగులు.. ఐపీఎల్ లో స్థానం దక్కని ప్లేయర్ విశ్వరూపం
TNPL 2025: ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 తుది అంకానికి చేరుకుంది. ఈ లీగ్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో స్థానం దక్కని ఆటగాళ్లు ఈ లీగ్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. TNPLలోని 11వ మ్యాచ్‌లో అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆటగాడు అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు సాధించిన ఈ ఆటగాడు, 12 భారీ సిక్సర్లు కొట్టాడు. కేవలం మూడు మ్యాచ్‌లలో 198 పరుగులు సాధించి రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
టీఎన్ సీఎల్ లోని 11వ మ్యాచ్ డిండిగల్ డ్రాగన్స్, సికిం మదురై పాంథర్స్‌ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో డిండిగల్ డ్రాగన్స్ ఓపెనర్ శివమ్ సింగ్ కేవలం 41 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 86 పరుగులు చేసి, తన జట్టుకు 45 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా 29 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 49 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అశ్విన్ ఓపెనింగ్‌కు వచ్చి, శివమ్ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 64 బంతుల్లో 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయం అంచుకు చేర్చాడు. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో శివమ్ సింగ్ 30, 82 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో అతను మొత్తం 12 సిక్సర్లు, 17 ఫోర్లు కొట్టాడు. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సికిం మదురై పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అత్యధికంగా 6 సిక్సర్లు కొట్టాడు.
అంతకుముందు, సికిం మదురై పాంథర్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మదురై తరఫున అతీక్ ఉర్ రెహమాన్ అత్యధికంగా 50 పరుగులు చేశాడు. దీనితో పాటు బాలచంద్ర అనిరుధ్ 24 బంతుల్లో 31 పరుగులు చేశాడు. డిండిగల్ డ్రాగన్స్ తరఫున గణేషన్ పెరియస్వామి, డిటి చంద్రశేఖర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆర్ అశ్విన్, సందీప్ వారియర్‌లకు చెరో ఒక వికెట్ లభించింది. ఈ లక్ష్యాన్ని డిండిగల్ జట్టు 12.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సాధించింది. శివమ్ సింగ్, అశ్విన్‌ల ఈ అద్భుత ప్రదర్శన డిండిగల్ డ్రాగన్స్‌ను TNPL 2025లో పటిష్ట స్థానానికి చేర్చింది. అభిమానులకు మర్చిపోలేని క్రికెట్ విందును అందిస్తోంది.