Ishan Kishan : సెంచరీ మిస్.. కానీ కంబ్యాక్..ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ వెనుక అసలు కారణం ఇదే!
Ishan Kishan : సెంచరీ మిస్.. కానీ కంబ్యాక్..ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ వెనుక అసలు కారణం ఇదే!
Ishan Kishan : ఐపీఎల్ 2025 సీజన్ ఇషాన్ కిషన్‌కు అంతగా కలిసి రాలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున విధ్వంసకర శతకంతో సీజన్‌ను ప్రారంభించినా, ఆ తర్వాత వరుసగా పది ఇన్నింగ్స్‌లలో విఫలమయ్యాడు. అభిమానులను నిరాశపరిచిన ఈ యువ ఆటగాడు, ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై తన అసలు సత్తా చాటాడు. కేవలం 48 బంతుల్లో 94 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అద్భుతమైన పునరాగమనం చేశాడు. కానీ, వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్, అకస్మాత్తుగా ఇంతటి దూకుడు ప్రదర్శించడానికి కారణం ఏంటి? ఈ అద్భుతమైన ఆట వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు చూద్దాం.
ఫామ్ కోల్పోయిన ఇషాన్
ఐపీఎల్ 2025లో ఇషాన్ కిషన్ ప్రదర్శన నిలకడగా లేదు. అతను బ్యాట్‌కు బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. వరుసగా 10 ఇన్నింగ్స్‌లలో పెద్ద స్కోర్లు సాధించలేకపోయాడు. దీంతో అతని ఫామ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, శుక్రవారం (మే 23, 2025) RCBతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కంప్లీట్ డిఫరెండ్ క్రికెటర్ గా కనిపించాడు.
కిషన్ మొదట క్రీజులోకి వచ్చినప్పుడు కాస్త నెమ్మదిగానే ఆడాడు. అదృష్టం కూడా తనను వరించింది. అతను తన స్కోరును ఓపెన్ చేయడానికి ఆడిన మొదటి బంతి వికెట్ కీపర్ జితేష్ శర్మ గ్లవ్స్ నుంచి జారిపోయి, క్యాచ్‌గా మారే అవకాశం ఉన్నా తప్పించుకుంది. ఈ లైఫ్‌తో ఇషాన్ కిషన్ క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. 10వ ఓవర్ నుంచి అతను తన స్కోరు వేగాన్ని పెంచడం ప్రారంభించాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఒక భారీ సిక్సర్ బాది తన ఫామ్‌లోకి వచ్చినట్లు సంకేతాలిచ్చాడు. సింగిల్స్, డబుల్స్‌తో నెమ్మదిగా స్కోరుబోర్డును కదిలిస్తూ 14వ ఓవర్‌లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
అర్ధ సెంచరీ తర్వాత RCBపై దాడి
అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఇషాన్ కిషన్ దూకుడు పెంచాడు. 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన అతను ఆ తర్వాత కేవలం 22 బంతుల్లోనే 94 పరుగులకు చేరుకున్నాడు. సెంచరీకి అతి చేరువలో నిలిచినప్పటికీ ప్యాట్ కమిన్స్ 6 బంతులు ఆడాల్సి రావడంతో ఇషాన్ కిషన్‌కు సెంచరీ చేసే అవకాశం లభించలేదు. చివరికి, అతను కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 231 పరుగుల భారీ స్కోరును చేయగలిగింది.
మార్చిన అదృష్టం!
ఇషాన్ కిషన్ ఈ అద్భుతమైన ప్రదర్శన వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. భారత-పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల ఐపీఎల్‌కు ఒక వారం పాటు విరామం లభించింది. ఈ బ్రేక్ ఇషాన్ కిషన్‌కు ఎంతో ఉపయోగపడిందని తెలుస్తోంది. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి లభించడంతో, అతను తన ఆటపై మరింత దృష్టి సారించగలిగాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మరింత కష్టపడి, తన బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేశాడు. ఈ విరామమే ఇషాన్ కిషన్‌ను తిరిగి ఫామ్‌లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పునరాగమనం తర్వాత ఇషాన్ కిషన్ పూర్తి భిన్నమైన, దూకుడుగా ఆడే ఆటగాడిగా కనిపించడం గమనార్హం.