IPL 2023: ఐపీఎల్ లో సెహ్వాగ్ మెచ్చిన టాప్ 5 బ్యాటర్స్ వీళ్లే..!

IPL 2023: అయితే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ లో టాప్ 5 బ్యాటర్ల జాబితాను విడుదల చేశాడు.

Update: 2023-05-27 14:45 GMT

IPL 2023: ఐపీఎల్ లో సెహ్వాగ్ మెచ్చిన టాప్ 5 బ్యాటర్స్ వీళ్లే..!

IPL 2023: దాదాపు 2నెలలు సాగిన ఐపీఎల్ 2023 సమరం ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ తో విజేత ఎవరో తెలిసిపోనుంది. ఈ సీజన్ లో చాలా మంది క్రికెటర్లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. 10 జట్లు పోటీపడిన ఈ టోర్నీలో కొందరు బ్యాటర్లు సెంచరీలతో అలరించారు. అయితే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ లో టాప్ 5 బ్యాటర్ల జాబితాను విడుదల చేశాడు.

ఐదురుగు క్రికెట్ పాండవులు వీరేనంటూ వీరేంద్ర సెహ్వాగ్ టాప్5 లిస్ట్ ను అనౌన్స్ చేశారు. ఈ జాబితాలో తొలి ఆటగాడిగా రింకు సింగ్ నిలిచాడు. వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అందుకే రింకు సింగ్ కు సెహ్వాగ్ తన టాప్5 జాబితాలో చోటు కల్పించారు. ఇక ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శివమ్ దూబేను ఎంచుకున్నారు. ఈ సీజన్ లో శివమ్ 33 సిక్స్ లతో శివాలెత్తించేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 160కి పైగా ఉంది. ఇక మూడో వ్యక్తి రాజస్థాన్ సంచలనం యశస్వి జైస్వాల్. కోల్ కతా పై మ్యాచ్ లో యశస్వి విధ్వంసకర బ్యాటింగ్ ను ఎవరూ మర్చిపోలేరు. 48 బాల్స్ లో 98 పరుగులు సాధించాడు. కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మనోడి అమోఘమైన బ్యాటింగ్ స్కిల్స్ ని విరాట్ , మలింగ, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, డేవిడ్ వార్నర్ ఇలా ఎందరో మెచ్చుకున్నారు.

ఇక నాల్గవ స్థానంలో మిసర్ట్ 360 సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే బ్యాక్ టు బ్యాక్ 200 ప్లస్ లక్ష్యాలను ఛేదించిన జట్టుగా ముంబయి ఇండియన్స్ రికార్డు సృష్టించిందంటే అందుకు కారణం సూర్య కుమార్ యాదవ్. బౌలర్ ఎవరైనా గ్రౌండ్ నలువైపులా బౌండరీలు బాదగల నైపుణ్యం సూర్య సొంతం. సూర్య కేవలం ఒక బ్యాటర్ మాత్రమే కాదు గణిత శాస్త్రజ్ఞుడు అంటూ టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు కూడా. ఇక సెహ్వాగ్ టాప్ 5 లిస్ట్ లో ఆఖరి స్థానంలో ఉన్న వ్యక్తి హెన్రిచ్ క్లాసెన్. ఎస్ ఆర్ హెచ్ తరపున క్లాసెన్ ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. స్పిన్, పేస్ బౌలింగ్ రెండింటిని క్లాసెన్ ఎదుర్కొన్న తీరు బాగుందని సెహ్వాగ్ కితాబు ఇచ్చారు. స్పిన్, పేస్ బౌలింగ్ రెండింటిలో భారీ షాట్లు కొట్టగల సత్తా ఉన్న విదేశీ బ్యాటర్స్ చాలా అరుదుగా ఉంటారని..అందులో క్లాసెన్ ముందువరుసలో ఉంటాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News