India vs NewZealand: ఇండియా-కివీస్ మధ్య ముగిసిన రెండో రోజు ఆట
* ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 129/0 * అర్థసెంచరీలతో రాణించిన ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్
ఇండియా-కివీస్ మధ్య ముగిసిన రెండో రోజు ఆట(ఫైల్ ఫోటో)
India vs NewZealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది.
ఓపెనింగ్ జోడి విల్ యంగ్ 75 పరుగులు, టామ్ లాథమ్ 50 పరుగులతో రాణిస్తున్నారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. మరోవైపు తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం చేసిన 16వ బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.